Telugu Global
National

అభ్యర్థులను వెతుక్కునే స్థితికి చేరుకుంటున్న టీడీపీ.... 2024లో టీడీపీకి అభ్యర్థులు కరువు..

జమిలి ఎన్నికలు తరుముకొస్తాయి, వీలైతే ఇంకా ముందే వస్తాయి.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే సిద్ధంగా ఉండండి తమ్ముళ్లూ.. అంటూ పదే పదే సెలవిస్తుంటారు చంద్రబాబు. సైనికులు సిద్ధంగానే ఉన్నారు. మరి వారిని లీడ్ చేసే నాయకులే టీడీపీకి కరువవుతున్నారు. 23మంది ఎమ్మెల్యేలలో ఈపాటికే నలుగురు చేజారారు. మిగతావారిలో ఎన్నికలనాటికి ఎంతమంది మిగిలుంటారో తెలియని పరిస్థితి. ఒకవేళ ఉన్నా.. టీడీపీ టికెట్ పై పోటీ చేయడానికి ఇష్టపడతారో లేదో అనుమానమే. టీడీపీనుంచి పోటీ చేయడానికి, అసలు టీడీపీలో క్రియాశీలకంగా […]

అభ్యర్థులను వెతుక్కునే స్థితికి చేరుకుంటున్న టీడీపీ.... 2024లో టీడీపీకి అభ్యర్థులు కరువు..
X

జమిలి ఎన్నికలు తరుముకొస్తాయి, వీలైతే ఇంకా ముందే వస్తాయి.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే సిద్ధంగా ఉండండి తమ్ముళ్లూ.. అంటూ పదే పదే సెలవిస్తుంటారు చంద్రబాబు. సైనికులు సిద్ధంగానే ఉన్నారు. మరి వారిని లీడ్ చేసే నాయకులే టీడీపీకి కరువవుతున్నారు. 23మంది ఎమ్మెల్యేలలో ఈపాటికే నలుగురు చేజారారు. మిగతావారిలో ఎన్నికలనాటికి ఎంతమంది మిగిలుంటారో తెలియని పరిస్థితి. ఒకవేళ ఉన్నా.. టీడీపీ టికెట్ పై పోటీ చేయడానికి ఇష్టపడతారో లేదో అనుమానమే. టీడీపీనుంచి పోటీ చేయడానికి, అసలు టీడీపీలో క్రియాశీలకంగా ఉండటానికే నాయకులు ఇష్టపడటంలేదు.

ఇటీవల ప్రకటించిన పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గాల అధ్యక్షుల లిస్ట్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఎవరో ఒకరికి అన్నట్టుగా ఈ పదవుల పంపకం జరిగింది. సీనియర్లు ఎవరూ బాధ్యతలు భుజానికెత్తుకోడానికి ఇష్టపడటంలేదు. కనీసం ఎన్నికలవరకయినా పార్టీని నడిపించే ఓపిక వారిలో లేదు. ఒకవేళ నడిపించినా వచ్చే దఫా టీడీపీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏ కోశానా లేదు.

అందుకే టీడీపీలో ఉన్నారన్న మాటే కానీ, సీనియర్లు ఎవరూ క్రియాశీలకంగా లేరు. ఫ్యాన్ స్పీడ్ ని కూడా తట్టుకుని నిలబడ్డ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే చేజారుతున్నారు. క్యాడర్ బలం ఏపాటిదో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి దక్కిన ఏకగ్రీవాలతోనే అర్థమైంది.

ఇక మిగిలిన సరుకంతా 2024నాటికి బీజేపీ, జనసేనలోకి సర్దుకుంటారని స్పష్టంగా తెలుస్తోంది. రానురాను మసకబారుతున్న పార్టీ ప్రభ, భవిష్యత్ నాయకత్వంపై ఉన్న అపారమైన అపనమ్మకం, మరోవైపు ప్రజా వ్యతిరేకత లేకుండా సాగుతున్న వైసీపీ పాలన.. వెరసి సైకిల్ గుర్తుపై పోటీ చేయడానికి 2024లో అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుందని అర్థమవుతోంది.

2019లో కనీసం కేఏపాల్ కి అభ్యర్థులు దొరికారు కానీ, 2024లో టీడీపీకి ఆమాత్రం కూడా పేరున్న నాయకులు దొరకరేమో అనిపిస్తోంది. అంటే దాదాపుగా ఏపీలో కాంగ్రెస్ పార్టీలాగా టీడీపీ కూడా పేరుగొప్ప, ఊరు దిబ్బ లాగా తయారవుతుందనమాట. బాబు వ్యూహాలు ఫలించి వచ్చే ఎన్నికలనాటికి బీజేపీ, జనసేన, టీడీపీ, వామపక్షాలు కూటమి కడితే.. పసుపు కండువా వేసుకునే అభ్యర్థులు దొరుకుతారేమో కానీ.. టీడీపీ ఒంటరిగా బరిలో దిగితే మాత్రం నాయకుల్ని చంద్రబాబు వెతుక్కోవాల్సి ఉంటుంది.

First Published:  30 Sep 2020 11:12 PM GMT
Next Story