Telugu Global
International

భారతీయ ప్రముఖులకోసం 8400కోట్లతో విమానాల కొనుగోలు...

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి ప్రయాణం చేసేందుకు కొనుగోలు చేసిన రెండు కొత్త విమానాల్లో ఒకటి భారత్ కు చేరుకుంది. బోయింగ్ బి777 రకానికి చెందిన ఈ రెండు విమానాలకోసం అమెరికాతో 2018లోనే భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి ఒక విమానం భారత్ కి రాగా, రెండోదాన్ని మరికొంత కాలం తర్వాత అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ ఎయిర్ ఇండియా కి అప్పగిస్తుందని అధికారులు చెబుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ప్రయాణం చేసే ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి […]

భారతీయ ప్రముఖులకోసం 8400కోట్లతో విమానాల కొనుగోలు...
X

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి ప్రయాణం చేసేందుకు కొనుగోలు చేసిన రెండు కొత్త విమానాల్లో ఒకటి భారత్ కు చేరుకుంది. బోయింగ్ బి777 రకానికి చెందిన ఈ రెండు విమానాలకోసం అమెరికాతో 2018లోనే భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి ఒక విమానం భారత్ కి రాగా, రెండోదాన్ని మరికొంత కాలం తర్వాత అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ ఎయిర్ ఇండియా కి అప్పగిస్తుందని అధికారులు చెబుతున్నారు.

అమెరికా ప్రెసిడెంట్ ప్రయాణం చేసే ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి ధీటుగా.. ఈ ఎయిర్ ఇండియా వన్ విమానం ఉంటుందని తెలుస్తోంది. ఈ భారీ విమానాలు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తో కూడి ఉంటాయి. లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ఫ్రా రెడ్ కౌంటర్ మెజర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్.. వీటి ప్రత్యేకత.

ఇప్పటి వరకు ఈ తరహా ప్రకత్యేకతలు కేవలం అమెరికా ప్రెసిడెంట్ ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి మాత్రమే ఉన్నాయి. గతంలో భారత ప్రముఖులకోసం ఎయిర్ ఇండియా బి747 మోడల్ విమానాలను నడిపేది. వీటికి ఎయిర్ ఇండియా స్టాఫ్ పైలట్లుగా వ్యవహరిస్తారు. వీటి మరమ్మతులు, నిర్వహణ బాధ్యత కూడా ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ చూసేది. కొత్తగా తీసుకుంటున్న బి777 విమానాలను నడిపే బాధ్యతను మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన పైలట్లకు అప్పగించారు.

భద్రతా ప్రమాణాలు, సౌకర్యాల పరంగా వీటిని అత్యాధునిక విమానాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ ఏడాది జులైలోనే ఇవి భారత్ కి చేరాల్సి ఉండగా.. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయింది. ఆ తర్వాత కొన్ని సాంకేతిక సమస్యల వల్ల మరికొన్నిరోజులు గడిచింది. తీరా ఇప్పుడు రెండు విమానాల్లో ఒకదానిని భారత్ కి పంపించారు.

ఇప్పటి వరకు ప్రముఖుల ప్రయాణాలకోసం వాడిన బి747 విమానాలు ఇకపై విధులనుంచి తప్పుకుంటాయి. వీటిని కమర్షియల్ వ్యవహారాలకోసం ఉపయోగిస్తారు. కొత్తగా తీసుకుంటున్న బి777 విమానాలలోనే ఇకపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణిస్తారు.

First Published:  2 Oct 2020 4:11 AM GMT
Next Story