Telugu Global
National

‘నాకు కోవిడ్ వస్తే మమతా బెనర్జీని కౌగిలించుకుంటా’... వచ్చింది !

తనకు కనుక కరోనా వైరస్ సోకితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హగ్ చేసుకుని ఆమెకు వైరస్ అంటుకునేలా చేస్తానంటూ కొన్ని రోజుల క్రితం వివాదాస్పదమైన వాఖ్యలు చేశారు బీజేపీ నాయకుడు అనుపమ్ హజ్రా. అలా అన్న హజ్రాకు ఇప్పుడు నిజంగానే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. బీజేపీ పార్టీకి కొత్తగా జాతీయ సెక్రటరీగా నియమితులైన హజ్రా తనకు కోవిడ్ వచ్చిన సంగతిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన కోల్ కతాలోని ఓ […]

‘నాకు కోవిడ్ వస్తే మమతా బెనర్జీని కౌగిలించుకుంటా’... వచ్చింది !
X

తనకు కనుక కరోనా వైరస్ సోకితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హగ్ చేసుకుని ఆమెకు వైరస్ అంటుకునేలా చేస్తానంటూ కొన్ని రోజుల క్రితం వివాదాస్పదమైన వాఖ్యలు చేశారు బీజేపీ నాయకుడు అనుపమ్ హజ్రా. అలా అన్న హజ్రాకు ఇప్పుడు నిజంగానే కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

బీజేపీ పార్టీకి కొత్తగా జాతీయ సెక్రటరీగా నియమితులైన హజ్రా తనకు కోవిడ్ వచ్చిన సంగతిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన కోల్ కతాలోని ఓ ప్రయివేటు హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ వారం మొదట్లో హజ్రా… మమతా బెనర్జీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది.

హజ్రా ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. జనవరి 2019లో ఆయన బీజేపీలో చేరారు. కిందటి శనివారమే ఆయన పార్టీ జాతీయ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ మరుసటి రోజే తనకు కోవిడ్ వస్తే ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటానని… అప్పుడే ఆమెకు దానికి గురయినవారి బాధ, దాని కారణంగా ఆప్తులను పొగొట్టుకున్నవారి దుఃఖం అర్థమవుతాయని వ్యాఖ్యానించారు.

రాష్ట్రముఖ్యమంత్రి, అదీ ఒక మహిళపై హజ్రా అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డార్జీలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది. హజ్రా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవరూ స్పందించలేదు. అయితే పార్టీ ఉపాధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన ముకుల్ రాయ్ మాత్రం… బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు వెనుకాముందు చూసుకుని కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అన్నారు.

First Published:  2 Oct 2020 7:30 AM GMT
Next Story