Telugu Global
CRIME

నిర్భయ నేరస్తుల న్యాయవాది... ఇప్పుడు హథ్రాస్ నిందితుల తరపున !

దేశంలో నిర్భయ ఘటన లాంటి ఉదంతాలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి.  మహిళల పై అత్యంత దారుణమైన, పాశవికమైన నేరాలు చేస్తున్న వారి తరపున నిలబడి న్యాయవాదులు వాదిస్తూనే ఉన్నారు. నిర్భయ ఘటనలో రేపిస్టుల తరపున వాదించిన న్యాయవాది ఎపి సింగ్ ఇప్పుడు హథ్రాస్ నిందితుల తరపున వాదించబోతున్నాడు. అఖిల భారతీయ క్షత్రియ మహాసభ… ఈ మేరకు ఎపి సింగ్ ని కోరబోతున్నదని తెలుస్తోంది. మరోవైపు నిర్భయ కేసులో నిర్భయ కుటుంబానికి అండగా నిలిచిన న్యాయవాది సీమా […]

నిర్భయ నేరస్తుల న్యాయవాది... ఇప్పుడు హథ్రాస్ నిందితుల తరపున !
X

దేశంలో నిర్భయ ఘటన లాంటి ఉదంతాలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి. మహిళల పై అత్యంత దారుణమైన, పాశవికమైన నేరాలు చేస్తున్న వారి తరపున నిలబడి న్యాయవాదులు వాదిస్తూనే ఉన్నారు. నిర్భయ ఘటనలో రేపిస్టుల తరపున వాదించిన న్యాయవాది ఎపి సింగ్ ఇప్పుడు హథ్రాస్ నిందితుల తరపున వాదించబోతున్నాడు. అఖిల భారతీయ క్షత్రియ మహాసభ… ఈ మేరకు ఎపి సింగ్ ని కోరబోతున్నదని తెలుస్తోంది.

మరోవైపు నిర్భయ కేసులో నిర్భయ కుటుంబానికి అండగా నిలిచిన న్యాయవాది సీమా కుష్వాహా ఇప్పుడు హథ్రాస్ కేసులో సైతం బాధిత కుటుంబానికి అండగా నిలబడనున్నారు. అంటే ఇప్పుడు తిరిగి ఎపి సింగ్, సీమ తలపడనున్నారు. గతంలో నిర్భయ కేసులో ఎపి సింగ్… నిర్భయ గురించి ఎన్నో వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసినా సీమా కుష్వాహా ఎంతో సంయమనంతో వ్యవహరించారనే పేరుంది.

ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఎపి సింగ్… అఖిల భారతీయ క్షత్రియ మహాసభ తనను తమ తరపున నియమించుకునేందుకు చాలా పెద్ద మొత్తంలో డబ్బుని సమీకరించిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ… చట్టాలను దుర్వినియోగ పరుస్తూ ఉన్నత కులాలపై అభాండాలు వేస్తున్నారని… ఆ సంస్థ భావిస్తోందని సింగ్ అన్నారు. అఖిల భారతీయ క్షత్రియ మహాసభకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి రాజా మన్వేంద్ర సింగ్… ఎపి సింగ్ ని హథ్రాస్ నిందితుల తరపు లాయరుగా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఉత్తర ప్రదేశ్ లో కులవివక్షతో, కుల దురహంకార ధోరణిలో అత్యాచారాలు జరుగుతున్నాయనే ఆందోళన దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసులో నిష్పక్షపాతంగా తీర్పు కావాలంటూ పలు అగ్రవర్ణాలకు చెందిన సంఘాలు ముందుకొస్తున్నాయి.

First Published:  6 Oct 2020 4:30 AM GMT
Next Story