Telugu Global
Cinema & Entertainment

నాగ్ బ్రేక్ ఇవ్వబోతున్నాడా?

బిగ్ బాస్ తో దుమ్ముదులుపుతున్నాడు నాగార్జున. వారాంతం వస్తే చాలు రకరకాల దుస్తులు వేసుకొచ్చి బిగ్ బాస్ ను రక్తికట్టిస్తున్నాడు. అయితే ప్రతి వారం నాగార్జున ఇలా చేయగలడా.. మరి అతడి సినిమాల సంగతేంటి.. సరిగ్గా ఇప్పుడు క్లిష్ట పరిస్థితి రానే వచ్చింది. ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు నాగ్. ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. ఓవైపు ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు వీకెండ్స్ లో బిగ్ బాస్ […]

నాగ్ బ్రేక్ ఇవ్వబోతున్నాడా?
X

బిగ్ బాస్ తో దుమ్ముదులుపుతున్నాడు నాగార్జున. వారాంతం వస్తే చాలు రకరకాల దుస్తులు వేసుకొచ్చి బిగ్ బాస్ ను రక్తికట్టిస్తున్నాడు. అయితే ప్రతి వారం నాగార్జున ఇలా చేయగలడా.. మరి అతడి సినిమాల సంగతేంటి.. సరిగ్గా ఇప్పుడు క్లిష్ట పరిస్థితి రానే వచ్చింది.

ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు నాగ్. ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. ఓవైపు ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు వీకెండ్స్ లో బిగ్ బాస్ లో పాల్గొంటున్నాడు నాగ్. అయితే ఇప్పుడు వైల్డ్ డాగ్ సినిమాకు సంబంధించి ఔట్ డోర్ షూట్ ప్లాన్ చేశారు.

త్వరలోనే కులుమనానీలో వైల్డ్ డాగ్ షెడ్యూల్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు బిగ్ బాగ్ కార్యక్రమాన్ని నాగార్జున ఎలా హ్యాండిల్ చేస్తాడు..? సరిగ్గా ఇక్కడే వైల్డ్ డాగ్ నిర్మాత నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగాడు.

నాగార్జునకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏకంగా ప్రైవేట్ జెట్ విమానం బుక్ చేశాడు. మనాలీలో సోమవారం నుంచి గురువారం వరకు వైల్డ్ డాగ్ షూటింగ్ ఉంటుంది. వీకెండ్స్ లో బిగ్ బాస్ షూటింగ్ కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తాడు నాగ్. బిగ్ బాస్ ముగించుకొని తిరిగి మనాలీ వెళ్లిపోతాడు. ఇలా 2 వారాలు మేనేజ్ చేయాలని నిర్ణయించారు.

First Published:  6 Oct 2020 10:40 PM GMT
Next Story