Telugu Global
CRIME

కేసులో మమ్మల్ని ఇరికించారు " హథ్రాస్ నిందితుడు

ఉత్తరప్రదేశ్‌లో 20 ఏళ్ల యువతి అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసులకు ఒక లేఖ రాశాడు. ఈ కేసులో నాతో పాటు మరో ముగ్గురిని కావాలనే ఇరికించారని.. తమకు న్యాయం చేయాలని ఆ లేఖలో కోరాడు. చనిపోయిన యువతిని ఆమె తల్లి, సోదరుడు కూడా హింసించారని అతడు లేఖలో పేర్కొన్నాడు. నిందితుల్లో ఒకరు యువతి కుటుంబానికి తెలుసనే ఆరోపణలకు ఈ లేఖ బలం చేకూరుస్తున్నది. హథ్రాస్ ఘటనలో సందీప్ ఠాకూర్‌తో పాటు మరో ముగ్గురు నిందితులుగా […]

కేసులో మమ్మల్ని ఇరికించారు  హథ్రాస్ నిందితుడు
X

ఉత్తరప్రదేశ్‌లో 20 ఏళ్ల యువతి అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసులకు ఒక లేఖ రాశాడు. ఈ కేసులో నాతో పాటు మరో ముగ్గురిని కావాలనే ఇరికించారని.. తమకు న్యాయం చేయాలని ఆ లేఖలో కోరాడు. చనిపోయిన యువతిని ఆమె తల్లి, సోదరుడు కూడా హింసించారని అతడు లేఖలో పేర్కొన్నాడు. నిందితుల్లో ఒకరు యువతి కుటుంబానికి తెలుసనే ఆరోపణలకు ఈ లేఖ బలం చేకూరుస్తున్నది.

హథ్రాస్ ఘటనలో సందీప్ ఠాకూర్‌తో పాటు మరో ముగ్గురు నిందితులుగా ఉన్నారు. వీరు హథ్రాస్ పోలీసులకు ఒక లేఖ రాశారు. సదరు మృతురాలు తనకు స్నేహితురాలని సందీప్ ఠాకూర్ పేర్కొన్నాడు. అప్పుడప్పుడు కలుసుకోవడంతో పాటు తాము ఫోన్లో కూడా మాట్లాడుకుంటామని అతడు తెలిపాడు. హిందీలో రాసిన ఈ లేఖలో నలుగురు నిందుతులు వేలి ముద్రలు కూడా వేశారు.

కాల్ డేటా రికార్డుల పరిశీలినలో నిందితుడు సందీప్‌తో బాధితురాలి సోదరుడు ఫోన్లో మాట్లాడుకున్నట్లు వెల్లడైంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వారిద్దరూ 104 కాల్స్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతురాలికి తనకు మధ్య స్నేహాన్ని వారి కుటుంబం అంగీకరించలేదని సందీప్ లేఖలో పేర్కొన్నాడు.

సంఘటన జరిగిన రోజు ఆమెను కలుసుకోవడానికి పొలానికి వెళ్లానని.. అక్కడ యువతి తల్లి, సోదరుడు ఉన్నట్లు సందీప్ లేఖలో వివరించాడు. అయితే యువతి అక్కడి నుంచి తనను వెళ్లిపొమ్మనడంతో పశువులను మేపుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపాడు.

ఆ తర్వాత ఆ యువతిని తల్లి, సోదరుడు తీవ్రంగా కొట్టినట్లు గ్రామస్థుల ద్వారా తెలుసుకున్నాను. నాతో స్నేహం చేసినందుకే ఆమెను వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపరిచారు అని అతడు తెలిపాడు. నేను సదరు యువతితో ఏనాడూ తప్పుగా ప్రవర్తించలేదు. అంతే కాకుండా ఏ రోజూ తనను కొట్టలేదు. కానీ ఆమె తల్లి, సోదరుడు తనపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని సందీప్ లేఖలో పేర్కొన్నాడు. నాతో పాటు మిగతా ముగ్గురు కూడా ఏ నేరం చేయలేదని.. కానీ తమను అనవసరంగా జైలుకు పంపారని లేఖలో చెప్పాడు. ఈ కేసులో సరైన దర్యాప్తు చేసి న్యాయం చేయాలని ఆయన కోరాడు.

నిందుతులు నలుగురు ప్రస్తుతం అలీఘర్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారు హథ్రాస్ పోలీసులకు లేఖ రాసినట్లు అలీఘర్ జైలు అధికారి ధృవీకరించారు. బుధవారం సాయంత్రం వాళ్లు ఈ లేఖను హథ్రాస్ ఎస్పీకి పంపినట్లు ఆయన చెప్పారు.

కాగా, నిందితుల లేఖపై బాధితురాలి తండ్రి స్పందించారు. ఆ లేఖలో అన్నీ అబద్దాలే రాశారని ఆయన స్పష్టం చేశారు. నేను నా కూతురిని కోల్పోయాను.. ఇప్పుడు వాళ్లు నా కూతురిపై అభాండాలు వేస్తున్నారు. ఇలాంటి వాటికి నేను భయపడను. నిందితులు లేఖలో రాసినవన్నీ అబద్దాలే అని ఆయన అన్నారు. నాకు ఎలాంటి పరిహారం అవసరం లేదు. న్యాయం చేస్తే చాలు అని ఆయన తెలిపాడు.

First Published:  8 Oct 2020 4:31 AM GMT
Next Story