Telugu Global
International

ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన 'కిస్సింగ్ ది కరోనా వైరస్'

2020 అంటే కరోనా తప్ప మరో విషయం కనపడటం లేదు. గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో పుట్టిన కరోనా క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించి అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ఈ ఏడాది మార్చి నుంచి కరోనా విస్తృతంగా వ్యాపించడంతో ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. కరోనా వైరస్‌పై ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ అయితే ఏకంగా ‘కరోనా వైరస్’ పేరుతో ఒక సినిమా కూడా తెరకెక్కించాడు. ఇండియాలో కరోనా వైరస్ ప్రవేశించిన తొలినాళ్లలోనే మార్కెట్‌లోకి ‘కిస్సింగ్ ది […]

ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన కిస్సింగ్ ది కరోనా వైరస్
X

2020 అంటే కరోనా తప్ప మరో విషయం కనపడటం లేదు. గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో పుట్టిన కరోనా క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించి అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ఈ ఏడాది మార్చి నుంచి కరోనా విస్తృతంగా వ్యాపించడంతో ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. కరోనా వైరస్‌పై ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ అయితే ఏకంగా ‘కరోనా వైరస్’ పేరుతో ఒక సినిమా కూడా తెరకెక్కించాడు.

ఇండియాలో కరోనా వైరస్ ప్రవేశించిన తొలినాళ్లలోనే మార్కెట్‌లోకి ‘కిస్సింగ్ ది కరోనా వైరస్’ అనే నవల వచ్చింది. ఈ నవలను ఎంజే ఎడ్వర్డ్స్ అనే రచయిత్రి రాశారు. క్లుప్తంగా ఈ కథను చెప్పుకోవాలంటే.. డాక్టర్ అలెక్సా అనే వైద్య శాస్త్రవేత్త కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టి దాన్ని తన తోటి శాస్త్రవేత్తపై ప్రయోగిస్తుంది. అయితే ఆ వ్యాక్సిన్ వికటించి ఆ శాస్త్రవేత్త మరణిస్తాడు.

మరణించిన శాస్త్రవేత్త శరీరాన్ని కరోనా వైరస్ ఆక్రమించేసి మానవుడిలా మారిపోతుంది. ఆ మానవాకారంలో ఉన్న కరోనా వైరస్‌తో శాస్త్రవేత్త ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ నవల చదివితే కాని అర్థం కాదు. కాగా ఈ నవలపై వైద్యులు, శాస్త్రవేత్తలు మండిపడుతున్నారు. వైద్య శాస్త్రాన్ని అపహాస్యం చేసేలా ఉన్న ఈ నవలను నిషేధించాలని డిమాండ్ చేశారు.

మొన్నటి వరకు ఈ నవలను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ వివాదం నేపథ్యంలో కిస్సింగ్ ది కరోనా వైరస్ నవల పాపులర్ అయ్యింది. అమెజాన్‌లో రూ.76 రూపాయలకు దొరుకుతుండటంతో విరివిగా కొంటున్నారట.

First Published:  8 Oct 2020 4:48 AM GMT
Next Story