Telugu Global
Cinema & Entertainment

క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌గా విజయ్ సేతుపతి

బాలీవుడ్, టాలీవుడ్‌లలో బయోపిక్‌ల సీజన్ నడుస్తున్నది. ఇటీవల తెరపైకి ఎక్కిన అనేక సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో నిర్మాతలు అలాంటి చిత్రాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు. సినిమా యాక్టర్లు కూడా ఆయా పాత్రల్లోకి ఒదిగిపోయి నటించడానికి సిద్దమవుతున్నారు. తాజాగా శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తమిళంలో ఒక బయోపిక్ నిర్మించనున్నారు. ఇందులో ముత్తయ్య పాత్రను విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పోషించనున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని విజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా […]

క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌గా విజయ్ సేతుపతి
X

బాలీవుడ్, టాలీవుడ్‌లలో బయోపిక్‌ల సీజన్ నడుస్తున్నది. ఇటీవల తెరపైకి ఎక్కిన అనేక సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో నిర్మాతలు అలాంటి చిత్రాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు. సినిమా యాక్టర్లు కూడా ఆయా పాత్రల్లోకి ఒదిగిపోయి నటించడానికి సిద్దమవుతున్నారు.

తాజాగా శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తమిళంలో ఒక బయోపిక్ నిర్మించనున్నారు. ఇందులో ముత్తయ్య పాత్రను విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పోషించనున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని విజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా గురువారం వెల్లడించాడు. ట్రైన్ మూవీస్, దార్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఎంఎస్ శ్రీపతి డైరెక్ట్ చేయనున్నాడు. అయితే దీనికి సంబంధించిన పూర్తి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

టెస్టు క్రికెట్ చరిత్రంలో 800 వికెట్లు తీసిన బౌలర్‌గా ముత్తయ్య రికార్డులకెక్కడు. ఇతడు శ్రీలంకలో పుట్టిన తమిళుడు. చెన్నైతో కూడా ఇతనికి అనుబంధం ఉంది. ముత్తయ్య పాత్రను విజయ్ సేతుపతి చాలా చాలెంజింగ్‌గా తీసుకున్నాడు. అతడిలా బౌలింగ్ చేయడానికి కొన్నాళ్లు ముత్తయ్య మురళీధరన్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తున్నది.

1972 ఏప్రిల్ 17న ముత్తయ్య శ్రీలంకలోని క్యాండీలో తమిళ హిందూ కుటుంబంలో జన్మించాడు. ముత్తయ్య తాత తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస వెళ్లాడు. ఆయన తాత తర్వాత కొన్నాళ్లకు తమిళనాడు లోని తిరుచిరాపల్లికి కుమార్తెలతో తిరిగి వచ్చి స్థిరపడ్డాడు. కానీ ముత్తయ్య తండ్రి శ్రీలంకలోనే ఉండిపోయాడు.

2005లో చెన్నైకు చెందిన మధిమలార్‌ను ముత్తయ్య పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు.

First Published:  8 Oct 2020 12:30 PM GMT
Next Story