Telugu Global
International

నేను అలా డిబేట్ చేయను " ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటంటే మాటే. తాను చేయాలనుకున్నదే చేస్తారు తప్ప ఇతరులు ఎలాంటి సలహాలు ఇచ్చినా లైట్ తీసుకుంటారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగబోతున్నాయి. రిపబ్లికన్ ల తరపున ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా డెమోక్రాట్ల తరపున జో బైడెన్ బరిలోకి దిగుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు తప్పకుండా పబ్లిక్ డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది. దేశం కోసం ఏమేం చేయబోతున్నారో ఆ […]

నేను అలా డిబేట్ చేయను  ట్రంప్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటంటే మాటే. తాను చేయాలనుకున్నదే చేస్తారు తప్ప ఇతరులు ఎలాంటి సలహాలు ఇచ్చినా లైట్ తీసుకుంటారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగబోతున్నాయి. రిపబ్లికన్ ల తరపున ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా డెమోక్రాట్ల తరపున జో బైడెన్ బరిలోకి దిగుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు తప్పకుండా పబ్లిక్ డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది. దేశం కోసం ఏమేం చేయబోతున్నారో ఆ డిబేట్లలో చర్చిస్తూనే.. ఎదుటి వ్యక్తుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ అమెరికాలోని టీవీ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు.

డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఒకసారి జో బైడెన్‌తో చర్చలో పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న రెండో దఫా డిబేట్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే కోవిడ్ బారిన పడిన ట్రంప్ గత కొన్ని రోజులుగా వైట్‌హౌస్‌లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. కోవిడ్ నెగెటివ్ వచ్చినా ఇంకా ఆయన క్వారంటైన్‌లో ఉంటున్నారు. దీంతో తర్వాతి డిబేట్ వర్చువల్ విధానంలో నిర్వహించాలని కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ (సీపీడీ) నిర్ణయించింది.

సీపీడీ నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. ‘తాను వర్చువల్ విధానంలో డిబేట్‌లో పాల్గొనను. అలా పాల్గొని తన సమయాన్ని వృధా చేసుకోను. ఇది తనకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని ఫాక్స్ మీడియాతో చెప్పారు. బైడెన్ కోసమే సీపీడీ ఇలా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు.

కాగా ప్రెసిడెన్షియల్ డిబేట్‌పై వచ్చిన వివాదంపై కమిషన్ స్పందించింది. డిబేట్‌లో పాల్గొనే వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని.. మేం ఎవరికీ అనుకూలంగా వ్యవహరించడం లేదని చెప్పారు. జో బైడెన్ వర్చువల్ విధానానికి సుముఖం వ్యక్తం చేసినా… ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు.

First Published:  9 Oct 2020 4:03 AM GMT
Next Story