శకుంతలగా ఆ హీరోయిన్ నిజమేనా?

ఓ సినిమా ప్రకటన ఇలా రావడం ఆలస్యం.. అలా పుకార్లు ప్రారంభమైపోతాయి. గుణశేఖర్ ప్రకటించిన శకుంతలం అనే పాన్-ఇండియా సినిమాపై కూడా ఇలానే పుకార్లు మొదలైపోయాయి.

ఇంతకీ ఆ పుకారు ఏంటంటే.. అన్నీ తానై గుణశేఖర్ తీయబోయే శకుంతలం అనే ప్రాజెక్టులో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేను తీసుకున్నారట. ఈ మేరకు చాలా వెబ్ సైట్స్ లో కథనాలు వచ్చాయి. అయితే అలాంటిదేం లేదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం శకుంతల పాత్ర కోసం ఎవ్వర్నీ ఫిక్స్ చేయలేదని.. ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లను మాత్రం పరిశీలిస్తున్నామని స్పష్టంచేసింది యూనిట్.

మహాభారతంలోని ఆదిపర్వంలో ఉన్న శకుంతల పాత్ర ఆధారంగా ఈ కథ రాసుకున్నాడు గుణశేఖర్. ఇతిహాసంలో ఉన్న ఈ ప్రేమకథకు తనదైన ఫిక్షన్ జోడించి సినిమా చేయబోతున్నాడు.