ఏడాదికి ఒక్క సినిమా చాలు

అవకాశాలు లేని హీరోయిన్లు చెప్పే వాదనలు, వినిపించే లాజిక్కులు భలే గమ్మత్తుగా ఉంటాయి. హీరోయిన్ మధుషాలినీ కూడా అలాంటిదే ఓ వింత లాజిక్ చెప్పుకొచ్చింది. తనకు ఎన్ని సినిమాలు చేస్తున్నామనేది ముఖ్యం కాదట. ఏడాదికి ఒక సినిమా చేసినా చాలంటోంది.

“ఏడాదికి ఒక్క సినిమా చేసినా చాలు… నాకు నచ్చింది చేస్తా. మంచి పాత్రలు లభించాలి. కథ బావుంటే ఎవరూ నన్ను ఒప్పించాల్సిన అవసరం లేదు. ‘బాబూ… నేనే నటిస్తా’ అని వెళతా. ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి.”

తనకు పెద్దగా అవకాశాలు రావడం లేదనే వాదనను మధుషాలినీ ఇలా తిప్పికొట్టింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లోకి కూడా ఎంటరైన ఈ బ్యూటీ.. ఇకపై సినిమాలతో కూడా బిజీ అవుతానంటోంది.

తమిళ్ లో బాల దర్శకత్వంలో ఆల్రెడీ ఓ సినిమా పూర్తిచేసిన మధుషాలినీ, మరో బై-లింగ్వుల్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు చేతిలో గూఢచారి-2 కూడా ఉంది.