Telugu Global
International

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్

కరోనా తర్వాత ఆయా సంస్థల్లో పని తీరు పూర్తిగా మారిపోయింది. చాలా మంది ఉద్యోగులకు పలు సంస్థలు ‘వర్క్ ఫ్రం హోం’ అవకాశాన్ని కల్పించాయి. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో అన్ని సంస్థలు తిరిగి ఉద్యోగులను కార్యాలయాల్లో పనికి తిరిగి పిలిస్తున్నాయి. అయితే ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’ మాత్రం తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇంటి నుంచే పని చేస్తున్న ఉద్యోగుల్లో అధిక […]

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్
X

కరోనా తర్వాత ఆయా సంస్థల్లో పని తీరు పూర్తిగా మారిపోయింది. చాలా మంది ఉద్యోగులకు పలు సంస్థలు ‘వర్క్ ఫ్రం హోం’ అవకాశాన్ని కల్పించాయి. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో అన్ని సంస్థలు తిరిగి ఉద్యోగులను కార్యాలయాల్లో పనికి తిరిగి పిలిస్తున్నాయి. అయితే ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’ మాత్రం తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ప్రస్తుతం ఇంటి నుంచే పని చేస్తున్న ఉద్యోగుల్లో అధిక శాతం మందికి శాశ్వతంగా ‘వర్క్ ఫ్రం హోం’ కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యాజమాన్యం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ అవకాశం అన్ని రకాల ఉద్యోగులకు వర్తించదని.. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు తమ మేనేజర్ల అనుమతి మేరకే ఉపయోగించుకునే వీలుంటుందని పేర్కొన్నది.

హార్డ్‌వేర్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్యోగులకు మాత్రం వర్క్ ఫ్రం హోం వర్తించదని.. వాళ్లు తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరు కావాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, వర్క్ ఫ్రం హోం చేసేవాళ్లు కూడా శాశ్వతంగా ఆ ఆప్షన్ పొందాలనుకుంటే నెలలో సగం పని దినాలకు మాత్రమే వర్తిస్తుందని.. మిగిలిన రోజులు కార్యాలయానికి హాజరు కావాలని పేర్కొంది.

ప్రస్తుతం కార్యాలయం ఉన్న నగరాలు, ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్న ఉద్యోగులు.. వర్క్ ఫ్రం హోంలో ఎక్కడి నుంచైనా పని చేయవచ్చని.. అవసరమైతే తమ సొంత దేశానికి వెళ్లి కూడా పని చేయవచ్చని పేర్కొన్నది. అయితే వారి జీతాల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. కాగా, కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత కార్యాలయాల పని వేళల్లో మాత్రం మార్పులు చేస్తామని మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది.

First Published:  10 Oct 2020 8:45 PM GMT
Next Story