మరో సర్ ప్రైజ్ తో రెడీ అయిన దర్శకుడు

ప్రభాస్ సినిమాకు సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ గ్యాప్ ఇచ్చేలా లేడు. మొన్ననే ఈ ప్రాజెక్టులోకి బిగ్ బిని తీసుకున్నట్టు ప్రకటించాడు. ఇంకా ఆ ట్రెండింగ్ లో ఉంటుండగానే మరో సర్ ప్రైజ్ మోసుకొచ్చాడు. ప్రభాస్ పుట్టినరోజు నాడు ఆ సర్ ప్రైజ్ ను బయటపెడతానంటున్నాడు.

వచ్చేనెల 23న ప్రభాస్ తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఆ రోజున ప్రభాస్-నాగఅశ్విన్ సినిమా టైటిల్ ను విడుదల చేసే ఆలోచనలో ఉంది యూనిట్. బహుశా ఇదే నాగ్ అశ్విన్ సర్ ప్రైజ్ అవ్వొచ్చు.

ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ గా దీపిక పదుకోన్ పేరును ఆల్రెడీ ఎనౌన్స్ చేశారు. కాబట్టి ఇక మిగిలింది సినిమా టైటిల్ మాత్రమే. ఇలా ప్రభాస్ సినిమా విషయంలో నాగ్ అశ్విన్ చాలా జోరుగా ఉన్నాడు.