Telugu Global
National

పోస్టాఫీసుల్లో జీరో అకౌంట్లు... డబ్బులు పడతాయని భారీగా క్యూ కడుతున్న జనాలు

కరోనా కాలం. ఏది నిజమో..ఏది అబద్ధమో తెలుసుకునేలోపే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతోంది. ఇప్పుడు పోస్టాఫీసుల దగ్గర జనం భారీగా క్యూ కడుతున్నారు. కొత్త సినిమా రిలీజ్‌ అయితే టికెట్ల కోసం అభిమానులు క్యూ కట్టినట్లు కడుతున్నారు. తెల్లవారుజామున ఉదయం ఐదు గంటలకు వచ్చి లైన్‌లో నిలిచి ఉంటున్నారు. పోస్టాఫీసుల్లో జీరో అకౌంట్స్‌ రద్దీ పెరిగిపోయింది. ఎవరు చెప్పారో తెలియదు. ఎవరో ప్రచారం చేశారో తెలియదు. జనాలు మాత్రం పోస్టాఫీసులకు క్యూలు కడుతున్నారు. జీరో అకౌంట్స్‌ ఓపెన్‌ చేస్తే […]

పోస్టాఫీసుల్లో జీరో అకౌంట్లు... డబ్బులు పడతాయని భారీగా క్యూ కడుతున్న జనాలు
X

కరోనా కాలం. ఏది నిజమో..ఏది అబద్ధమో తెలుసుకునేలోపే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతోంది. ఇప్పుడు పోస్టాఫీసుల దగ్గర జనం భారీగా క్యూ కడుతున్నారు. కొత్త సినిమా రిలీజ్‌ అయితే టికెట్ల కోసం అభిమానులు క్యూ కట్టినట్లు కడుతున్నారు. తెల్లవారుజామున ఉదయం ఐదు గంటలకు వచ్చి లైన్‌లో నిలిచి ఉంటున్నారు.

పోస్టాఫీసుల్లో జీరో అకౌంట్స్‌ రద్దీ పెరిగిపోయింది. ఎవరు చెప్పారో తెలియదు. ఎవరో ప్రచారం చేశారో తెలియదు. జనాలు మాత్రం పోస్టాఫీసులకు క్యూలు కడుతున్నారు. జీరో అకౌంట్స్‌ ఓపెన్‌ చేస్తే ప్రభుత్వం డబ్బు వేస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో జనాలు పోస్టాఫీసుల దగ్గర బారులు తీరుతున్నారు.

హైదరాబాద్‌లో పలు పోస్టాఫీసుల దగ్గర జీరో అకౌంట్స్‌ తెరవడం కోసం తెల్లవారు జామునుంచి పెద్ద ఎత్తున జనాలు బారులు తీరారు. పనులు మానేసి మరీ పోస్ట్ ఆఫీస్ వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. జీరో అకౌంట్స్ లో ప్రభుత్వం డబ్బు వేస్తుందనే ప్రచారంతో పోస్టాఫీసులు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్‌ హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ దగ్గర దాదాపు వెయ్యి మంది నిల్చున్నారు. కరోనా కాలంలో సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదంటూ పోస్టాఫీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

అయితే పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్స్ పెంచుకోవడం కోసం… ఎవరో చేసిన ప్రచారంతో జనాలు భారీగా క్యూ కడుతున్నారని తెలిసింది. వచ్చే రోజుల్లో పోస్ట్‌ ఆఫీస్ అకౌంట్‌ ఉంటేనే ప్రభుత్వ రాయితీలు ఇస్తారని తెలివిగా చేసిన ప్రచారాన్ని నమ్మి… జనాలు ఇలా క్యూ కడుతున్నారని అంటున్నారు.

First Published:  11 Oct 2020 10:26 PM GMT
Next Story