ప్రభాస్ బర్త్ డేకు ఊహించని గిఫ్ట్ ఇది

ప్రభాస్ బర్త్ డేకు రాధేశ్యామ్ సినిమా నుంచి టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆదిపురుష్ టీమ్ నుంచి మరో ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. నాగఅశ్విన్ సినిమా నుంచి టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే ఈసారి ప్రభాస్ పుట్టినరోజుకు ఓ ఊహించని గిఫ్ట్ రెడీ అయింది. అది కూడా సాహో రూపంలో.

అవును.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో సినిమాను ప్రసారం చేయబోతోంది జీ తెలుగు ఛానెల్. ఈనెల 23న తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు ప్రభాస్. అంతకంటే 5 రోజుల ముందే, అదే వారంలో సాహో సినిమాను టెలికాస్ట్ చేయాలని నిర్ణయించింది జీ తెలుగు.

అంటే.. 18వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి జీ తెలుగులో సాహో సినిమా ప్రసారం అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మరోసారి ట్రెండ్ అయింది.

నిజానికి ఇదొక ఫ్లాప్ సినిమా. దీన్ని అంతలా మోయాల్సిన అవసరం లేదు. కాకపోతే బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నుంచి మరో సినిమా టీవీల్లో కనిపించలేదు. ప్రభాస్ కొత్త సినిమా చూడాలంటే స్టార్ మా ఛానెల్ లో బాహుబలి-2 చూడాల్సిందే. ఇప్పుడా లోటును సాహో మూవీ భర్తీ చేయబోతోంది.