స్టాండప్ కమెడియన్ గా రాజ్ తరుణ్

తన కెరీర్ లో క్యారెక్టర్స్ పరంగా పెద్దగా ప్రయోగాలు చేయలేదు రాజ్ తరుణ్. అంధగాడు లాంటి సినిమాల్లో కళ్లులేని వాడిగా నటించినప్పటికీ అది ఫ్లాప్ అవ్వడంతో ఇక ప్రయోగాలు మానుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రయోగాలపై దృష్టిపెట్టినట్టున్నాడు ఈ హీరో. తన అప్ కమింగ్ మూవీలో స్టాండప్ కమెడియన్ గా నటించబోతున్నాడు.

సంతోష్ అనే కుర్రాడు చెప్పిన కథ రాజ్ తరుణ్ కు చాలా బాగా నచ్చిందట. వెంటనే ఆ మూవీలో నటించడానికి ఓకే చెప్పాడు. ఆ సినిమాలో రాజ్ తరుణ్ ది స్టాండప్ కమెడియన్ పాత్ర. అంటే.. లైవ్ లో మైక్ పట్టుకొని జోకులు చెప్పి అందర్నీ నవ్వించాలన్నమాట. ఇప్పటివరకు రాజ్ తరుణ్ ఇలాంటి పాత్ర చేయలేదు.

అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి మాత్రం ఇంకాస్త టైమ్ పడుతుందంటున్నాడు ఈ హీరో. ఎందుకంటే.. ప్రస్తుతం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ మూవీ తర్వాత అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై మరో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే సంతోష్ దర్శకత్వంలో తన స్టాండప్ కమెడియన్ సినిమా మొదలవుతుందని అంటున్నాడు. చూస్తుంటే.. రాజ్ తరుణ్ బాగానే బిజీ అయినట్టున్నాడు.