ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్లారిటీ

లాంగ్ గ్యాప్ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఈ మూవీ ఇలా సెట్స్ పైకి వచ్చిందో లేదో అలా రూమర్లపై క్లారిటీ ఇవ్వడం స్టార్ట్ చేసింది యూనిట్. ఇప్పటికే ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ డేట్ పై పూర్తి స్పష్టత ఇచ్చిన యూనిట్.. తాజాగా సినిమాకు సంబంధించి మరో కీలకమైన విషయాన్ని వెల్లడించింది.

ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు స్వతంత్ర సమరయోధులు చరిత్రలో ఎన్నడూ కలుసుకోలేదు. ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందని ఆలోచనతో ఆర్ఆర్ఆర్ వస్తోంది. వీళ్లిద్దరూ కలిసి బ్రిటిషర్లపై కలిసి పోరాటం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదే లేదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు స్వతంత్ర పోరాటానికి అస్సలు సంబంధం లేదని యూనిట్ తెలిపింది. స్వతంత్ర ఉద్యమ కాలంనాటి పరిస్థితులు కనిపిస్తాయి తప్ప.. ఆ ఉద్యమానికి ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని యూనిట్ తెలిపింది. పూర్తిగా 2 ఫిక్షన్ పాత్రలు తీసుకొని సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపింది.