ప్రేరణ.. విభా… పూజ

ఈరోజు పూజా హెగ్డే పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి కొత్త పోస్టర్లు విడుదల చేశారు. ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేద్దామంటే ఆల్రెడీ ఆ లుక్స్ వచ్చేశాయి. అందుకే ఈసారి కొత్త పోస్టర్లు విడుదల చేయడంతో పాటు.. ఆయా సినిమాల్లో పూజా క్యారెక్టర్ పేర్లను బయటపెట్టారు.

ముందుగా రాధేశ్యామ్ విషయానికొద్దాం. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రేరణ అనే అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది పూజా హెగ్డే. ఈ మేరకు ఈరోజు ఓ కొత్త పోస్టర్ విడుదల చేసి మరీ ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రేరణ పాత్రలో పూజ లుక్స్ బాగున్నాయి.

ఇక అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తోంది పూజా హెగ్డే. ఆ మూవీకి సంబంధించి కూడా కొత్తగా మరో స్టిల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విభా అనే పాత్రలో ఆమె కనిపించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్ పాత్రను పూజా పోషిస్తుందనే టాక్ ఉంది.

ఈ రెండు స్టిల్స్ తో పూజాహెగ్డే ఈరోజు బాగానే సందడి చేసింది. అన్నట్టు ఈరోజు పూజా ఇండియాలో లేదు. ప్రభాస్ తో ఇటలీలో ఉంది.