Telugu Global
National

భారీ వర్షాలు... తెలంగాణలో రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం నుంచి ముసురుకున్న వర్షం మంగళవారానికి భారీ వర్షాలుగా మారాయి. మరో రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ముందు భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. […]

భారీ వర్షాలు... తెలంగాణలో రెడ్ అలర్ట్
X

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం నుంచి ముసురుకున్న వర్షం మంగళవారానికి భారీ వర్షాలుగా మారాయి.

మరో రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ముందు భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రిజర్వాయర్లు నిండిపోయి ప్రమాదకర స్థితికి చేరుకున్నందున లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. ప్రస్తుతం 1762 అడుగులకు నీళ్లు చేరుకున్నాయని.. 1763కి చేరుకోగానే గేట్లు ఎత్తుతామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై జనరల్ మేనేజర్ స్పష్టం చేశారు. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 2010లో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారని.. తిరిగి 10 ఏళ్ల తర్వాత గేట్లు ఎత్తే పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలైన… కిస్మత్‌పుర, బండ్లగూడ, హైదర్‌గూడ, లంగర్‌హౌస్, కార్వాన్ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు అధికారులు చెప్పారు.

First Published:  13 Oct 2020 9:04 AM GMT
Next Story