Telugu Global
National

సూర్యరశ్మి శక్తివంతమైన క్రిమి సంహారిణి... జగన్‌ లేఖ బహిర్గతం మంచిదే

జస్టిస్‌ ఎన్‌ వీ రమణ ఏపీ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారని, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు సీజేకు రాసిన లేఖపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న భూషణ్‌… జగన్‌ లేఖను బహిర్గతం చేయడాన్ని తప్పుపడుతున్న వారిని వ్యతిరేకించారు. అసలెందుకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి అని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. సూర్యరశ్మి శక్తివంతమైన క్రిమిసంహారిణి అని… కాబట్టి […]

సూర్యరశ్మి శక్తివంతమైన క్రిమి సంహారిణి... జగన్‌ లేఖ బహిర్గతం మంచిదే
X

జస్టిస్‌ ఎన్‌ వీ రమణ ఏపీ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారని, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు సీజేకు రాసిన లేఖపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న భూషణ్‌… జగన్‌ లేఖను బహిర్గతం చేయడాన్ని తప్పుపడుతున్న వారిని వ్యతిరేకించారు.

అసలెందుకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి అని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. సూర్యరశ్మి శక్తివంతమైన క్రిమిసంహారిణి అని… కాబట్టి ఈ విషయం వెలుగులోకి రావడం వల్ల మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

తెలుగుదేశం పార్టీకి- ఎన్‌వీ రమణకు సంబంధాలున్నాయని, అధికార పార్టీకి వ్యతిరేకంగా హైకోర్టును ప్రయోగిస్తున్నారని… అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ చేశారంటూ ఇంత తీవ్రమైన అభియోగాలను సీఎం చేసిన తర్వాత వీటిపై విచారణ జరపకుండా ఉండడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.

ఈ అంశంపై విచారణకు పదవీవిరమణ చేసిన ముగ్గురు నిజాయితీపరులైన న్యాయమూర్తులను నియమించాలని ప్రశాంత్ భూషణ్ సూచించారు. సుప్రీంకోర్టులోగానీ, హైకోర్టులో గానీ ఉన్న సిట్టింగ్ జడ్జిలతో దర్యాప్తు చేయిస్తే వారు దీన్ని నిస్పక్షపాతంగా విచారించే అవకాశం ఉండదు అని ప్రశాంత్ భూషణ్‌ వ్యాఖ్యానించారు.

First Published:  13 Oct 2020 10:20 PM GMT
Next Story