కోలీవుడ్ లో మరో మల్టీస్టారర్

విశాల్-ఆర్య కలిసి సినిమా చేయడం కొత్తేంకాదు. గతంలో వీళ్లిద్దరూ వీడు-వాడు అనే సినిమాలో నటించారు. ఆ మూవీకి బాల దర్శకత్వం వహించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ స్నేహితులిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఈసారి వీళ్లిద్దర్నీ కలిపిన ఘనత ఆనంద్ శంకర్ కు దక్కింది.

రెండేళ్ల కిందట విజయ్ దేవరకొండ హీరోగా నోటా అనే సినిమా తీశాడు ఈ ఆనంద్ శంకర్. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ కనిపించలేదు. ఎట్టకేలకు ఓ మల్టీస్టారర్ కథతో ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చాడు ఆనంద్ శంకర్. ఈ ప్రాజెక్టును ఆయన స్వయంగా ప్రకటించాడు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎన్నో ఏళ్ల కిందట విశాల్-ఆర్య కలిసి చేసిన వాడు-వీడు సినిమాకు సంబంధించి ఇప్పటికీ చెన్నైలోని ఓ స్థానిక కోర్టులో కేసు నడుస్తోంది. ఓ ప్రాంతం మనోభావాల్ని ఆర్య దెబ్బతీశాడనేది ఆ కేసు. అదింకా కొలిక్కిరాకముందే ఈ హీరోలిద్దరూ మరోసారి కలిశారు.