అఖిల్ కు ఆ సెంటిమెంట్ పట్టుకుందా?

హిట్స్ వస్తే ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. అదే ఫ్లాప్ వస్తే మాత్రం ఎక్కడలేని సెంటిమెంట్స్ పుట్టుకొస్తాయి. అక్కినేని హీరో అఖిల్ కూడా ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ నే కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ల విషయంలో అఖిల్ ఈ సెంటిమెంట్ పాటిస్తున్నాడు.

అల వైకుంఠపురములో సినిమా పెద్ద హిట్టయింది. కాబట్టి అందులో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డేను తన కొత్త సినిమాలో తీసుకున్నాడు అఖిల్. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడీ సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ చేస్తున్నాడు అఖిల్.

ఈ ఏడాది సంక్రాంతికొచ్చిన సరిలేవు నీకెవ్వరు సినిమా కూడా హిట్టయింది. కాబట్టి అందులో హీరోయిన్ గా నటించిన రష్మికను ఇప్పుడు రిపీట్ చేయబోతున్నాడు. త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే స్పై థ్రిల్లర్ లో రష్మికను తీసుకుంటున్నాడు. అఖిల్ పట్టుబట్టి మరీ రష్మికను సెలక్ట్ చేశాడట.