Telugu Global
National

టాక్స్ కట్టాల్సిందే... రజనీకాంత్ కు కోర్టులో అక్షింతలు

హీరో రజనీకాంత్ ను మద్రాస్ హైకోర్టు సున్నితంగా మందలించింది. సూపర్ స్టార్ చేసిన పనిని తొలి తప్పుగా క్షమించి విడిచిపెట్టింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. రజనీకాంత్ కు చెన్నైలోని కోడంబాకం ప్రాంతంలో రాఘవేంద్ర కల్యాణ మండపం ఉంది. దీనికి పన్ను చెల్లించాల్సిందిగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే రజనీకాంత్ మాత్రం పన్ను చెల్లించడానికి నిరాకరించారు. లాక్ డౌన్ కారణంగా మార్చి నెల నుంచి తన కల్యాణ మండపం ఖాళీగా ఉందని, ఎలాంటి ఆదాయం రాలేదని, అలాంటప్పుడు పన్ను […]

టాక్స్ కట్టాల్సిందే... రజనీకాంత్ కు కోర్టులో అక్షింతలు
X

హీరో రజనీకాంత్ ను మద్రాస్ హైకోర్టు సున్నితంగా మందలించింది. సూపర్ స్టార్ చేసిన పనిని తొలి తప్పుగా క్షమించి విడిచిపెట్టింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. రజనీకాంత్ కు చెన్నైలోని కోడంబాకం ప్రాంతంలో రాఘవేంద్ర కల్యాణ మండపం ఉంది. దీనికి పన్ను చెల్లించాల్సిందిగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.

అయితే రజనీకాంత్ మాత్రం పన్ను చెల్లించడానికి నిరాకరించారు. లాక్ డౌన్ కారణంగా మార్చి నెల నుంచి తన కల్యాణ మండపం ఖాళీగా ఉందని, ఎలాంటి ఆదాయం రాలేదని, అలాంటప్పుడు పన్ను ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. అయినప్పటికీ అన్నాడీఎంకే ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించలేదు. 6 లక్షల 50వేల రూపాయల టాక్స్ కట్టాల్సిందేనంటూ మళ్లీ నోటీసులు పంపించింది.

దీంతో హైకోర్టును ఆశ్రయించారు రజనీకాంత్. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును కట్టకుండా, తిరిగి దానిపై కోర్టుకు రావడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పన్ను కట్టుకుండా కోర్టు కేసు వేయడం సమంజసం కాదని, ఇలా కోర్టుకు రావడం అస్సలు మంచి పద్ధతి కాదని రజనీకాంత్ ను మందలించింది. కేసు వాపసు తీసుకోకపోతే జరిమానా విధించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. దీంతో రజనీకాంత్ వెనక్కి తగ్గారు. 6 లక్షల 50వేల రూపాయల పన్ను చెల్లించబోతున్నారు.

First Published:  14 Oct 2020 10:07 PM GMT
Next Story