శోభన్ బాబుపై క్లారిటీ ఇచ్చిన రానా

ఓ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ నిన్నటివరకు రానా చుట్టూ తిరిగింది. అదేంటంటే.. ఒకప్పటి స్టార్ హీరో శోభన్ బాబు బయోపిక్ లో రానా నటించబోతున్నాడట. ఓ స్టార్ డైరక్టర్, రానాకు మధ్య ఈ మేరకు చర్చలు జరిగాయట. ఇదీ క్లుప్తంగా రానా చుట్టూ జరిగిన ప్రచారం.

ఎట్టకేలకు ఈ మేటర్ పై రానా క్లారిటీ ఇచ్చాడు. తను శోభన్ బాబు బయోపిక్ లో నటించడం లేదని కుండబద్దలుకొట్టాడు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే.. తనను ఎవ్వరూ అలాంటి కాన్సెప్ట్ తో సంప్రదించలేదని చెబుతున్నాడు రానా.

వీటితో పాటు ప్రస్తుతం తను కొత్త సినిమాలు అంగీకరించే స్థితిలో లేనని చెబుతున్నాడు రానా. ఈ హీరో చేతిలో ప్రస్తుతం విరాటపర్వం సినిమా ఉంది. ఇది పూర్తయిన తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి. వీటితో పాటు కుదిరితే అయ్యప్పనుమ్ కోషియమ్ ప్రాజెక్టును కూడా సెట్స్ పైకి తీసుకురావాలి. సో.. ఇలాంటి టైమ్ లో మరో ప్రాజెక్టు ఓకే చేసే ఆలోచనలో లేడు రానా.