విశాఖలో వైసీపీ స్వీప్ చేస్తుంది – వీడీపీఏ

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు మొదలవగానే కరోనా వచ్చింది. ఎన్నికలు జరగలేదు.

అయితే వీడీపీఏ సర్వే సంస్థ ఒక సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు జీవీఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై సర్వే చేసినట్టు ఆసంస్థ చెబుతోంది.

మొత్తం 98 స్థానాల్లో వైసీపీ 84 నుంచి 89 స్థానాలను సొంతం చేసుకుంటుందని… స్వీప్ చేస్తుందని వెల్లడించింది. టీడీపీ కేవలం 8 నుంచి 14 స్థానాలకు పరిమితం అవుతుందని వివరించింది.

ఓటు షేర్ చూస్తే వైసీపీకి 49. 8 శాతం, టీడీపీకి 36.5 శాతం జనసేనకు 4.1 శాతం, బీజేపీకి 2.8 శాతం, కాంగ్రెస్‌కు 1.7 శాతం ఓట్లు వస్తాయని వీడీపీ అసోసియేట్స్ సంస్థ వెల్లడించింది. వైసీపీ ఏకపక్షంగా స్వీప్ చేస్తుంది అని ఈ సర్వే చెబుతోంది.