చిరంజీవి ముందుజాగ్రత్త

తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు చిరంజీవి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక దగ్గర సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈమధ్య కాలంలో చిరంజీవి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అందుకే ఈసారి హీరోయిన్ల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు చిరు.

త్వరలోనే వేదాళం రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఈ హీరో. ఇందులో కీలకమైన ఓ పాత్ర కోసం సాయిపల్లవిని అనుకుంటున్నారు. ఆమెకు నెరేషన్ కూడా ఇచ్చారు. చిరంజీవి చెల్లెలిగా నటించేందుకు సాయిపల్లవి కూడా దాదాపు ఓకే చెప్పింది. అయినప్పటికీ దేనికైనా మంచిదని, ఇదే పాత్ర కోసం కీర్తిసురేష్ ను కూడా లైన్లో పెట్టారు. షూటింగ్ స్టార్ట్ అయ్యే టైమ్ కు ఎవరు అందుబాటులోకి వస్తే వాళ్లనే తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలకు హీరోయిన్ల సమస్యల్ని ఎదుర్కొన్నాడు చిరంజీవి. ఆచార్యకైతే మరీ ఘోరం, ఆఖరి నిమిషంలో త్రిష తప్పుకుంది. అందుకే తన నెక్ట్స్ మూవీ వేదాళంకు అలాంటి ఇబ్బందులు లేకుండా ఇలా ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నాడు మెగాస్టార్.