అను ఎమ్మాన్యుయేల్ కు మరో ఛాన్స్

హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. బన్నీ లాంటి హీరో సరసన నటించిన తర్వాత ఆమె దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ నా పేరు సూర్య డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రభావం అను ఎమ్మాన్యుయేల్ పై గట్టిగా పడింది. ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. మరీ ముఖ్యంగా మేకర్స్ కు అందుబాటులో ఉండదనే రిమార్క్ కూడా వచ్చేసింది. దీనికి తోడు కుటుంబ సమస్యలు కూడా ఈమెను చుట్టుముట్టాయి.

ఇలాంటి ఇమేజ్ నుంచి, సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది అను ఎమ్మాన్యుయేల్. మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టిన ఈ బ్యూటీ.. మెల్లమెల్లగా అవకాశాలు అందుకుంటోంది.

ఇప్పటికే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన అల్లుడు శ్రీను అనే సినిమాలో నటిస్తున్న అను.. తాజాగా మరో ఆఫర్ అందుకుంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మహాసముద్రం సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.

అంతా బాగానే ఉంది కానీ అను ఎమ్మాన్యుయేల్ ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ స్థాయికి పడిపోయింది. అటు అల్లుడు అదుర్స్ లో అయినా, ఇటు మహాసముద్రంలోనైనా ఆమెకు సెకెండ్ హీరోయిన్ పాత్రలే దక్కుతున్నాయి.