Telugu Global
National

హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది కోటేశ్వరరావు ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డీజీపీపై హైకోర్టు కామెంట్స్‌ పై గత నెలలోనే కోటేశ్వరరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ లేఖను పిటిషన్‌గా స్వీకరించాలని కోరారు. ఇప్పుడు దాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా సుప్రీంకోర్టు స్వీకరించింది. సుప్రీంకోర్టు సీజేకు రాసిన లేఖలో న్యాయవాది కోటేశ్వరరావు డీజీపీపై వ్యాఖ్యలతో పాటు ఏపీ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలనూ వివరించారు. […]

హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు
X

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది కోటేశ్వరరావు ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డీజీపీపై హైకోర్టు కామెంట్స్‌ పై గత నెలలోనే కోటేశ్వరరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ లేఖను పిటిషన్‌గా స్వీకరించాలని కోరారు. ఇప్పుడు దాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా సుప్రీంకోర్టు స్వీకరించింది.

సుప్రీంకోర్టు సీజేకు రాసిన లేఖలో న్యాయవాది కోటేశ్వరరావు డీజీపీపై వ్యాఖ్యలతో పాటు ఏపీ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలనూ వివరించారు. గత నెలలో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా డీజీపీని ఉద్దేశించి కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులను నియంత్రించ లేనప్పుడు, ఆ సామర్థ్యం లేనప్పుడు డీజీపీ పదవికి రాజీనామా చేయాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఈవ్యాఖ్యలను మరుసటి రోజు తెలుగు దిన పత్రికలు కొన్ని పెద్దపెద్ద హెడ్‌లైన్స్ పెట్టి డీజీపీని చులకన చేసేలా రాశాయి. ఈ అంశాన్ని కూడా కోటేశ్వరరావు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యాఖ్యల వల్ల పోలీస్ వ్యవస్థ నైతికస్థైర్యం దెబ్బతినే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా దాఖలవుతున్న పిటిషన్ల వ్యవహారాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి లాయర్ కోటేశ్వరరావు తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వానికి ప్రతికూలంగా వస్తున్న తీర్పులు, వాటి పర్యవసనాలు, మీడియా కవరేజీ, జూనియర్‌ లాయర్లు సైతం హైకోర్టులో పిటిషన్లు వేసి తమకు కావాల్సిన ఉత్తర్వులు ఎలా పొందుతున్నారో కూడా న్యాయవాది కోటేశ్వరరావు వివరించారు.

ఈ లేఖను ఇప్పుడు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా సుప్రీంకోర్టు స్వీకరించింది. కోటేశ్వరరావు లేవనెత్తిన అంశాలపై కోర్టు విచారణ చేయనుంది.

First Published:  16 Oct 2020 8:09 AM GMT
Next Story