Telugu Global
CRIME

క్లయింట్స్ నుంచి రూ. 217 కోట్ల క్యాష్... న్యాయవాదిపై ఐటీ దాడులు

అతడో లాయర్.. అతడు కోర్టులో సాధారణ కేసులు వాదించడం కంటే.. బడా సంస్థల మధ్య ఏర్పడే వివాదాలను కోర్టు బయట పరిష్కరించడం, మధ్యవర్తిత్వం వహించడమే అతడు చేస్తుంటాడు. సాధారణంగా కోర్టు ఇందుకు అనుమతిస్తుంది. కానీ ఆ లాయర్ ఇలాంటి కేసులను డీల్ చేస్తూ భారీ స్థాయిలో ఫీజు తీసుకుంటున్నాడు. అదే సమయంలో తనకు వస్తున్న ఫీజును తక్కువ చేసి చూపుతూ ట్యాక్స్ ఎగ్గొడుతూ వస్తున్నాడు. దీనిపై ఉప్పందుకున్న ఆదాయపు పన్ను శాఖ ఢిల్లీ, హర్యాణాలో ఉన్న అతడి […]

క్లయింట్స్ నుంచి రూ. 217 కోట్ల క్యాష్... న్యాయవాదిపై ఐటీ దాడులు
X

అతడో లాయర్.. అతడు కోర్టులో సాధారణ కేసులు వాదించడం కంటే.. బడా సంస్థల మధ్య ఏర్పడే వివాదాలను కోర్టు బయట పరిష్కరించడం, మధ్యవర్తిత్వం వహించడమే అతడు చేస్తుంటాడు. సాధారణంగా కోర్టు ఇందుకు అనుమతిస్తుంది. కానీ ఆ లాయర్ ఇలాంటి కేసులను డీల్ చేస్తూ భారీ స్థాయిలో ఫీజు తీసుకుంటున్నాడు. అదే సమయంలో తనకు వస్తున్న ఫీజును తక్కువ చేసి చూపుతూ ట్యాక్స్ ఎగ్గొడుతూ వస్తున్నాడు. దీనిపై ఉప్పందుకున్న ఆదాయపు పన్ను శాఖ ఢిల్లీ, హర్యాణాలో ఉన్న అతడి ఇల్లు, కార్యాలయాలపై దాడులు చేయగా విస్తుపోయే నిజాలు తెలిశాయి.

చండీఘర్‌కు చెందిన ఒక లాయర్‌పై చేసిన దాడులో అతను క్లయింట్ల నుంచి రూ. 217 కోట్ల ఫీజును క్యాష్ రూపంలో తీసుకున్నట్లు గుర్తించారు. బుధవారం లాయర్‌కు చెందిన 38 ప్రదేశాల్లో దాడులు చేసి రూ. 5.5 కోట్లు సీజ్ చేశారు. దాంతో పాటు అతనికి చెందిన 10 బ్యాంక్ లాకర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సదరు లాయర్ ఒక క్లయింట్ నుంచి రూ.117 కోట్లు ఫీజు తీసుకున్నాడు. కానీ లాయర్ మాత్రం రూ. 21 కోట్లు ఫీజు వచ్చినట్లు లెక్కల్లో చూపాడు. అలాగే ఒక ఇన్‌ఫ్రా కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థకు మధ్య వివాదాన్ని పరిష్కరించిన తర్వాత రూ. 100 కోట్లు ఫీజు రూపంలో అందినట్లు కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అధికారులు తెలిపారు.

సదరు లాయర్ ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో కీలక సభ్యుడని తెలుస్తున్నది. ఈ లాయర్ క్యాష్ రూపంలోనే కాకుండా హవాలా ద్వారా కూడా డబ్బులు తీసుకున్నాడని సీబీడీటీ అధికారులు తెలిపారు. అతడి బ్యాంకు నివేదికలకు నిల్వలకు చాలా తేడా కనిపిస్తున్నదని.. అత్యధిక మొత్తం హవాలా ద్వారానే వచ్చినట్లు గుర్తించామని అధికారులు చెప్పారు. అతడిపై ట్యాక్స్ ఎగవేతకు సంబంధించిన కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు.

ఢిల్లీ, చంఢిఘర్ న్యాయవాద వర్గాల్లో ఈ దాడులు, లాయర్ ఫీజుల వివరాలు చర్చనీయాంశంగా మారాయి.

First Published:  16 Oct 2020 12:38 AM GMT
Next Story