Telugu Global
National

తుళ్లూరు ఎమ్మార్వో కేసు నుంచి తప్పుకున్న జస్టిస్ రాయ్‌

తుళ్లూరు ఎమ్మార్వోగా పనిచేసిన అన్నే సుధీర్‌బాబు కేసు విషయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసులో వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్ ఈ‌ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అంటే ఈ కేసు మరో బెంచ్‌కు బదిలీ కాబోతుంది. అందుకోసం ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచనున్నారు. వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత న్యాయమూర్తి మరో బెంచ్‌కు కేసును బదిలీ […]

తుళ్లూరు ఎమ్మార్వో కేసు నుంచి తప్పుకున్న జస్టిస్ రాయ్‌
X

తుళ్లూరు ఎమ్మార్వోగా పనిచేసిన అన్నే సుధీర్‌బాబు కేసు విషయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసులో వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్ ఈ‌ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అంటే ఈ కేసు మరో బెంచ్‌కు బదిలీ కాబోతుంది.

అందుకోసం ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచనున్నారు. వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత న్యాయమూర్తి మరో బెంచ్‌కు కేసును బదిలీ చేయాలని ఆదేశించడం అరుదైన అంశంగా భావిస్తున్నారు. రాయ్‌కి నిజాయితీపరుడైన న్యాయమూర్తిగా పేరుంది. అలాంటి న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌ చేసి ఆ తర్వాత తప్పుకోవడంపై చర్చ జరుగుతోంది.

అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించదంటూ ఎస్సీఎస్టీలను భయపెట్టి… తక్కువ ధరకే అసైన్డ్ భూములను వారు టీడీపీ నేతలకు అమ్ముకునేలా సుధీర్ బాబు చేసినట్టు అభియోగం. దీనిపై సీఐడీ కేసు నమోదు చేయగా… ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సుధీర్‌బాబుపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌పై స్టే ఇచ్చింది. దర్యాప్తును నిలిపివేసింది.

దీనిపై ప్రభుత్వం సుప్రీకోర్టుకు వెళ్లగా…. వారంలోగా ఈ కేసును తేల్చాలని ఏపీ హైకోర్టుకు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును మానవేంద్రనాథ్‌ రాయ్‌ విచారించారు. ఈనెల 12న ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ రాయ్‌… తీర్పును రిజర్వ్ చేశారు. ఆయన ఈ వ్యవహారంలో తీర్పు ఇవ్వాల్సి ఉంది.

First Published:  15 Oct 2020 10:13 PM GMT
Next Story