మళ్లీ జైలుకెళ్లిన నితిన్

హీరో నితిన్ మళ్లీ ఖైదీ డ్రెస్సు వేసుకున్నాడు. మరోసారి జైల్లోకి వెళ్లాడు. అయితే ఇదంతా సినిమా కోసమే. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేస్తున్న చెక్ అనే సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఖైదీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచి మళ్లీ మొదలైంది. నితిన్ పై ఖైదీ గెటప్ లో కొన్ని సీన్స్ పిక్చరైజ్ చేశారు.

సినిమా దాదాపు సగానికి పైగా జైల్లోనే నడుస్తుంది. అందుకే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జైలు సెట్ వేశారు. ప్రస్తుతం నడుస్తున్న షూటింగ్, మూవీకి చివరి షెడ్యూల్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెక్ సినిమా థియేటర్లలోకి రానుంది.