వకీల్ సాబ్ నుంచి క్లారిటీ రాబోతోందా?

వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పట్నుంచి మొదలవుతుందనే విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. మరి ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు? ఇప్పుడా క్లారిటీ కూడా వచ్చేలా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ దసరాకే వకీల్ సాబ్ రిలీజ్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

దసరాకు వకీల్ సాబ్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు. అదే టీజర్ లో రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ఈ మేరకు టీజర్ వర్క్ మొదలైంది. రిలీజ్ డేట్ పై పవన్ తో చర్చలు కూడా కొనసాగుతున్నాయి.

వకీల్ సాబ్ సినిమా సంక్రాంతికి వస్తుందనే టాక్ చాన్నాళ్లుగా వినిపిస్తోంది. అటు దిల్ రాజుకు కూడా సంక్రాంతికే రావాలని ఉంది. మరి దీనిపై పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. వేణుశ్రీరామ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.