Telugu Global
National

చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లారా..?

కేవలం టీడీపీ అనుకూల మీడియాలో చంద్రబాబు ఫొటో కనపడుతోంది కానీ.. రెండు రోజులుగా చంద్రబాబు కనీసం సోషల్ మీడియాలో కూడా కనిపించడంలేదు. జూమ్ మీటింగ్ లకు బ్రేక్ పడింది, వీడియో కాన్ఫరెన్స్ లు కూడా జరగలేదు. పోనీ కొడుకు లోకేష్ ని ప్రమోట్ చేయడంకోసం తాను జనాల్లోకి, కార్యకర్తల ముందుకు వెళ్లడం మానేశారని అనుకున్నా.. కనీసం జూమ్ లో అయినా చంద్రబాబు కనిపించాలి కదా అనేది సగటు టీడీపీ కార్యకర్త అనుమానం కూడా. హైదరాబాద్ నుంచి ఉండవల్లి […]

చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లారా..?
X

కేవలం టీడీపీ అనుకూల మీడియాలో చంద్రబాబు ఫొటో కనపడుతోంది కానీ.. రెండు రోజులుగా చంద్రబాబు కనీసం సోషల్ మీడియాలో కూడా కనిపించడంలేదు. జూమ్ మీటింగ్ లకు బ్రేక్ పడింది, వీడియో కాన్ఫరెన్స్ లు కూడా జరగలేదు. పోనీ కొడుకు లోకేష్ ని ప్రమోట్ చేయడంకోసం తాను జనాల్లోకి, కార్యకర్తల ముందుకు వెళ్లడం మానేశారని అనుకున్నా.. కనీసం జూమ్ లో అయినా చంద్రబాబు కనిపించాలి కదా అనేది సగటు టీడీపీ కార్యకర్త అనుమానం కూడా.

హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న తర్వాత చంద్రబాబు బైట ఎక్కడా కనిపించిన దాఖలా లేదు. తొలి రెండురోజులు వీడియో కాన్ఫరెన్స్ లతో హడావిడి చేసినా.. సీఎం జగన్ లేఖ బైటకొచ్చిన తర్వాతనుంచి ఆయన సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటున్నారు. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కేవలం పుట్టినరోజు విషెస్ మాత్రమే బైటకొస్తున్నాయి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాసిన తర్వాత చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. జగన్ లేఖ బైటకు రాగానే బాబు అడ్రస్ గల్లంతైందని అంటున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని, ఏ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ విమర్శలు పక్కనపెడితే.. కనీసం టీడీపీ నేతలకు కూడా చంద్రబాబు అందుబాటులో లేరు అనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఇంటికి ఎవర్నీ రావద్దంటున్నారు, ముఖ్య నేతలెవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు, కనీసం జూమ్ లో కూడా మీటింగ్ పెట్టడంలేదు.

ఇంతకీ చంద్రబాబు ఏమైనట్టు, ఎక్కడికి వెళ్లిపోయినట్టు. అమరావతి ఆందోళనకు మద్దతు తెలిపేందుకు, పార్టీ మహిళా ఇంచార్జ్ ల ప్రమాణ స్వీకారోత్సవానికి, వరద బాధితుల పరామర్శలకు.. ఇలా ప్రతి చోటా నారా లోకేష్ మాత్రమే కనిపిస్తున్నారు. అమరావతి ఉద్యమం కోసం జోలెపట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు.. 300రోజుల మైలురాయి చేరుకున్నాక.. కనీసం వారిని పలకరించడానికి కూడా బైటకు రాలేదంటే అంతకంటే ముఖ్యమైన పని ఇంకేముంటుందనే అనుమానం కలగక మానదు.

ఎవరి అనుమానాలు ఎలా ఉన్నా.. జగన్ లేఖ బైటకు రావడం, అప్పటినుంచి చంద్రబాబు బైట కనిపించకపోవడం.. ఈ రెండిటి మధ్య లింకు బాగా కుదిరింది. దీన్ని బేస్ చేసుకునే చంద్రబాబు అజ్ఞాంలోకి వెళ్లిపోయారంటూ విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ నేతల్లో సైతం అనుమానాలు రేకెత్తిస్తున్నారు.

First Published:  16 Oct 2020 9:08 PM GMT
Next Story