నాగశౌర్య నుంచి మరో సినిమా

లాక్ డౌన్ తర్వాత స్పీడ్ పెంచిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది నాగశౌర్య మాత్రమే. అన్ లాక్ మొదలైన వెంటనే తన రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు శౌర్య. బ్యాక్ టు బ్యాక్ వాటికి కాల్షీట్లు కూడా కేటాయించాడు. ఇప్పుడు అదే ఊపులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో.

అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు శౌర్య. గతంలో అలా ఎలా, లవర్ లాంటి సినిమాలు తీశాడు ఈ డైరక్టర్. ఇప్పుడు నాగశౌర్యతో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేయబోతున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాను తన సొంత బ్యానర్ పై నాగశౌర్య నిర్మించబోతున్నాడు.

ప్రస్తుతం ఈ హీరో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో క్రీడా నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి కొలిక్కి వచ్చిన వెంటనే, సొంత బ్యానర్ లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తాడు నాగశౌర్య.