అధికారం వైసీపీదే అయినా… టీడీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు

అధికారంలో ఉన్నా, లేకున్నా టీడీపీ నేతలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. అరెస్ట్‌ చేస్తే గంటలో బయటకు వస్తాం… కోర్టుకెళ్తే ఒక్క రోజులో తేల్చుకుంటాం అన్న డైలాగులు టీడీపీ వారి నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీ సురేష్‌పై దాడి చేసేందుకు వచ్చిన టీడీపీ నేత పూర్ణచంద్రరావు అదే డైలాగ్ చెప్పారు.

తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే , హిందూపురం టీడీపీ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పోలీసులపై రెచ్చిపోయారు. అధికారం పోయినా వారు అస్సలు భయపడడం లేదు. నేరుగా పోలీసులకే వార్నింగ్‌లు ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా బీకే పార్థసారథి కంకర తరలిస్తుండడంతో ఆయన వాహనాలను అధికారులు సీజ్ చేశారు.

విషయం తెలుసుకున్న పార్థసారథి స్థానిక ఎస్‌ఐకి ఫోన్‌ చేసి వార్నింగ్ ఇచ్చారు. నేనెవరో తెలుసా… తెలిసే పనిచేశావా… కంకర తరలిస్తున్న నా టిప్పర్లనే ఆపి కేసులు పెడతారా? మీ అంతు చూస్తా అంటూ వార్నింగ్ వచ్చారు.

టీడీపీ నేతలు ఇలా పోలీసులకు వార్నింగ్‌లు ఇవ్వడం వరుసగా జరుగుతోంది. అయినా ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవస్థలపై తమకున్న పట్టును చూసుకునే టీడీపీ నేతలు ఇలా రెచ్చిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.