Telugu Global
Cinema & Entertainment

ఆదిపురుష్ లో హీరోయిన్ ఫిక్స్?

ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక్కో విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఓవైపు అధికారికంగా ప్రకటనలు వస్తున్నప్పటికీ మరోవైపు ఈ సినిమాపై ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఇందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై తాజాగా మరో ప్రచారం ఊపందుకుంది. ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించనుందట. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అంటే కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుందన్నమాట. ఈ మేరకు చర్చలు […]

ఆదిపురుష్ లో హీరోయిన్ ఫిక్స్?
X

ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక్కో విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఓవైపు అధికారికంగా ప్రకటనలు వస్తున్నప్పటికీ మరోవైపు ఈ సినిమాపై ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఇందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై తాజాగా మరో ప్రచారం ఊపందుకుంది.

ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించనుందట. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అంటే కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుందన్నమాట. ఈ మేరకు చర్చలు మొదలైనట్టు కథనాలు వస్తున్నాయి.

ఇంతకుముందు ఇదే పాత్రకు కియరా అద్వానీ, కీర్తిసురేష్ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా ఇప్పుడు కృతి సనన్ పేరు తెరపైకొచ్చింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 23న ఆదిపురుష్ హీరోయిన్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

First Published:  18 Oct 2020 7:00 AM GMT
Next Story