Telugu Global
Cinema & Entertainment

రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ రెడీ

“రెబ‌ల్ స్టార్” ప్ర‌భాస్ హీరోగా గొపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియెష‌న్స్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం “రాధేశ్యామ్‌. బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న “రెబ‌ల్‌స్టార్” నుంచి వస్తున్న మరో పాన్-ఇండియా మూవీ ఇది. ఈమధ్యే సినిమా టైటిల్ ను రిలీజ్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. ఇదే స్పీడ్ లో న‌వ‌రాత్రులు, ప్రభాస్ పుట్టినరోజు ను […]

రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ రెడీ
X

“రెబ‌ల్ స్టార్” ప్ర‌భాస్ హీరోగా గొపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియెష‌న్స్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం “రాధేశ్యామ్‌. బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న “రెబ‌ల్‌స్టార్” నుంచి వస్తున్న మరో పాన్-ఇండియా మూవీ ఇది.

ఈమధ్యే సినిమా టైటిల్ ను రిలీజ్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. ఇదే స్పీడ్ లో న‌వ‌రాత్రులు, ప్రభాస్ పుట్టినరోజు ను దృష్టిలో పెట్టుకొని మోషన్ పోస్టర్ రెడీ చేశారు.

అక్టోబ‌ర్ 23న‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా “బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్” పేరిట మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తున్నారు. పూజా హేగ్డే ఇందులో హీరోయిన్.

ఇక రాధేశ్యామ్ షూటింగ్ అప్ డేట్స్ చూస్తే.. ప్ర‌స్తుతం యూర‌ప్ లో షూటింగ్ జ‌రుగుతోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ రిలీజ్ అవుతుంది.

First Published:  18 Oct 2020 2:32 AM GMT
Next Story