ఓటీటీ బాట పట్టిన రంగమార్తాండ

ఓటీటీలోకి ఇప్పటికే ఓ మోస్తరు సినిమాలన్నీ వచ్చేశాయి. కాస్త క్రేజ్ ఉన్న నిశ్శబ్దం లాంటి సినిమాలు కూడా వచ్చేశాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి రంగమార్తాండ సినిమా కూడా చేరబోతోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే రంగమార్తాండ సినిమాను ఓటీటీకి ఇచ్చేయాలని నిర్ణయించింది యూనిట్.

ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తయింది. కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలింది. ఈలోగా థియేటర్లు తెరుచుకుంటాయి కాబట్టి నేరుగా థియేటర్లలోకి వచ్చేయొచ్చని టీమ్ భావించింది. కానీ థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రేక్షకులు రావడం లేదు. పైగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే అంశంపై క్లారిటీ లేదు.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రంగమార్తాండ సినిమాను ఓటీటీకి ఇచ్చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే 2 ప్రముఖ ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లేదా జీ5 సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకునే అవకాశం ఉంది.