మరో సినిమా స్టార్ట్ చేసిన రవితేజ

రవితేజ మళ్లీ స్పీడ్ పెంచాడు. ఒక సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో సినిమా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. క్రాక్ సినిమా ఇంకా సెట్స్ పై ఉంటుండగానే కొత్త సినిమా మొదలుపెట్టాడు రవితేజ. ఈ సినిమా పేరు ఖిలాడీ.

రమేష్ వర్మ దర్శకత్వంలో ఈరోజు ఈ సినిమా లాంఛ్ అయింది. మూవీ మొదలైన రోజునే చాలా విశేషాలు మోసుకొచ్చారు. మరీ ముఖ్యంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రవితేజ స్మార్ట్ గా ఉంటాడట. అంటే లుక్స్ లో కాదు చేతల్లో స్మార్ట్ అని అర్థం.

ఇక ఈ సినిమాకు మరో స్పెషాలిటీ ఏంటంటే.. రవితేజ ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఒక పాత్రకు మీనాక్షి చౌదరి హీరోయిన్. మరో పాత్రకు డింపుల్ హయతి హీరోయిన్. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.