Telugu Global
National

మరో 3 రోజులు అప్రమత్తంగా ఉండండి... యంత్రాంగం అంతా ఈ పని మీదే ఉంది...

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రజలు మరో మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. హైదరాబాద్‌లో అసాధారణ స్థాయిలో వర్షం పడిందన్నారు. ఈస్థాయిలో వర్షపాతం నమోదుకావడం హైదరాబాద్‌ చరిత్రలో ఇది రెండో సారి అన్నారు. ఆస్తి నష్టం జరిగినా ప్రాణనష్టం జరగకూడదన్నదే తమ ఆలోచనన్నారు. 1350 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నివేదించామని… కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఏపీ, కర్నాటక నుంచి 30 బోట్లను తెప్పిస్తున్నామన్నారు. రాబోయే మూడు రోజుల్లో […]

మరో 3 రోజులు అప్రమత్తంగా ఉండండి... యంత్రాంగం అంతా ఈ పని మీదే ఉంది...
X

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రజలు మరో మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. హైదరాబాద్‌లో అసాధారణ స్థాయిలో వర్షం పడిందన్నారు. ఈస్థాయిలో వర్షపాతం నమోదుకావడం హైదరాబాద్‌ చరిత్రలో ఇది రెండో సారి అన్నారు. ఆస్తి నష్టం జరిగినా ప్రాణనష్టం జరగకూడదన్నదే తమ ఆలోచనన్నారు. 1350 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నివేదించామని… కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఏపీ, కర్నాటక నుంచి 30 బోట్లను తెప్పిస్తున్నామన్నారు.

రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 33 మంది చనిపోయారన్నారు. ముగ్గురు గల్లంతు అయ్యారని… వారి కోసం గాలిస్తున్నామన్నారు. అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు. కేవలం ఈ పరిస్థితిని ఎదుర్కోవడంపైనే మొత్తం యంత్రాంగం పనిచేస్తుందన్నారు.

80కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయన్నారు. ముంపు ప్రాంతాలకు చెందిన ప్రజలను, దెబ్బతిన్న ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ సహకారం కూడా తీసుకుంటున్నామన్నారు. మూడు చెరువులు తెగిపోవడంతో భారీ నష్టం జరిగిందన్నారు. చెరువులు ఆక్రమణకు గురైన మాట వాస్తవమేనన్నారు. పుకార్లు ప్రచారం చేయవద్దని కోరారు.

First Published:  19 Oct 2020 3:46 AM GMT
Next Story