Telugu Global
National

హైదరాబాద్‌ వరదబాధితుల కోసం మేఘా 10 కోట్ల విరాళం

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయంగా ప్రభుత్వాలకు భారీ విరాళాలు ఇవ్వడంలో మేఘా సంస్థ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటోంది. వ్యక్తిగా సినీనటుడు సోనూసూద్‌ 12కోట్ల రూపాయలు కరోనా బాధితులకోసం ఖర్చుపెట్టి సినీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడు. అలాగే కార్పొరేట్‌ సంస్థల్లో రతన్‌ టాటా (టాటా సంస్థ), అజీమ్ ప్రేమ్‌జీ (విప్రో), మేఘా కృష్ణా రెడ్డి (మెయిల్) వంటి వ్యక్తులు కార్పొరేట్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను […]

హైదరాబాద్‌ వరదబాధితుల కోసం మేఘా 10 కోట్ల విరాళం
X

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయంగా ప్రభుత్వాలకు భారీ విరాళాలు ఇవ్వడంలో మేఘా సంస్థ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటోంది.

వ్యక్తిగా సినీనటుడు సోనూసూద్‌ 12కోట్ల రూపాయలు కరోనా బాధితులకోసం ఖర్చుపెట్టి సినీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడు. అలాగే కార్పొరేట్‌ సంస్థల్లో రతన్‌ టాటా (టాటా సంస్థ), అజీమ్ ప్రేమ్‌జీ (విప్రో), మేఘా కృష్ణా రెడ్డి (మెయిల్) వంటి వ్యక్తులు కార్పొరేట్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపు మేరకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ (MEIL) వెంటనే స్పందించింది. సీఎం సహాయనిధికి (CMRF) పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది

వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయక చర్యలకు అండగా ఉండేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు మేఘా యాజమాన్యం తెలిపింది. ఆపద సమయంలో ప్రజలను ఆదుకునేందుకు తన వంతు బాధ్యతగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. వరద బాధితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ సహాయం తోడ్పడుతుందని అభిప్రాయపడింది.

First Published:  19 Oct 2020 6:27 AM GMT
Next Story