Telugu Global
National

ముఖ్యమంత్రి మతంపై హైకోర్టులో విచారణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మతంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమల వెళ్లిన జగన్‌ అక్కడ డిక్లరేషన్‌పై సంతకం చేయలేదని… ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనని కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్ రెడ్డి విధులు నిర్వహించకుండా నిలువరించాలంటూ అమరావతికి చెందిన ఆలోకం సుధాకర్ బాబు అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ముఖ్యమంత్రి క్రిస్టియన్ అనడానికి ఆధారాలు ఏమున్నాయని పిటిషనర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఆధారాలు లేకుండా ఈ పిటిషన్‌పై ఎలా ముందుకెళ్లగలం అని […]

ముఖ్యమంత్రి మతంపై హైకోర్టులో విచారణ
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మతంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమల వెళ్లిన జగన్‌ అక్కడ డిక్లరేషన్‌పై సంతకం చేయలేదని… ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనని కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్ రెడ్డి విధులు నిర్వహించకుండా నిలువరించాలంటూ అమరావతికి చెందిన ఆలోకం సుధాకర్ బాబు అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.

ముఖ్యమంత్రి క్రిస్టియన్ అనడానికి ఆధారాలు ఏమున్నాయని పిటిషనర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఆధారాలు లేకుండా ఈ పిటిషన్‌పై ఎలా ముందుకెళ్లగలం అని నిలదీసింది. ముఖ్యమంత్రినే దీనిపై వివరణ ఇచ్చేలా కోరాలని పిటిషనర్‌ సూచించగా కోర్టు అభ్యంతరం తెలిపింది. తామెందుకు ముఖ్యమంత్రి మతం గురించి అడగాలి… పిటిషన్‌ వేసిన మీరే ఆధారాలు ఉంటే చూపండి అంటూ న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ఈ కేసులో గవర్నర్‌ను కూడా ప్రతివాదిగా చేర్చడంపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఈ విషయంలో రిజస్ట్రీని కూడా పిలిచి న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతివాదుల జాబితా నుంచి గవర్నర్‌ పేరును సుమోటోగా తొలగిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి మతంపై పూర్తి ఆధారాలుంటే సమర్పించాలని అప్పుడే దీనిపై ముందుకెళ్తామంటూ విచారణను కోర్టు వాయిదా వేసింది.

First Published:  19 Oct 2020 10:02 PM GMT
Next Story