Telugu Global
National

చంద్రబాబుకు ఆంతరంగిక కాపలాదారే ఎన్‌వీ రమణ " జస్టిస్ బీఎస్‌ఏ స్వామి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణకు వ్యతిరేకంగా పెద్దెత్తున చాలా మంది గళమెత్తుతున్నారు. ఎన్‌వీ రమణకు సంబంధించిన పలు అంశాలను గుర్తు చేస్తున్నారు. గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్‌ఏ స్వామి రచించిన పుస్తకంలో ఎన్‌వీ రమణ గురించి వివరించిన అంశాలను ఒక ప్రతిక ప్రచురించింది. పదవీ విరమణ తర్వాత 2005లో ‘ఎ క్యాస్ట్‌ క్యాప్చర్‌ ఏపీ జ్యుడీషియరీ’ పేరుతో ఓ పుస్తకాన్ని తన అనుభవాలతో బీఎస్ ఏ స్వామి రాశారు. ఆ పుస్తకంలో చంద్రబాబుకు, ఎన్‌వీ రమణకు […]

చంద్రబాబుకు ఆంతరంగిక కాపలాదారే ఎన్‌వీ రమణ  జస్టిస్ బీఎస్‌ఏ స్వామి
X

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణకు వ్యతిరేకంగా పెద్దెత్తున చాలా మంది గళమెత్తుతున్నారు. ఎన్‌వీ రమణకు సంబంధించిన పలు అంశాలను గుర్తు చేస్తున్నారు. గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్‌ఏ స్వామి రచించిన పుస్తకంలో ఎన్‌వీ రమణ గురించి వివరించిన అంశాలను ఒక ప్రతిక ప్రచురించింది.

పదవీ విరమణ తర్వాత 2005లో ‘ఎ క్యాస్ట్‌ క్యాప్చర్‌ ఏపీ జ్యుడీషియరీ’ పేరుతో ఓ పుస్తకాన్ని తన అనుభవాలతో బీఎస్ ఏ స్వామి రాశారు. ఆ పుస్తకంలో చంద్రబాబుకు, ఎన్‌వీ రమణకు మధ్య సంబంధాలను సూటిగా వివరించారు.

ఎన్‌వీ రమణను చంద్రబాబుకు ఆంతరంగిక కాపలాదారుగా జస్టిస్ బీఎస్‌ఏ స్వామి అభివర్ణించారు. తొలుత ఎన్‌వీ రమణను చంద్రబాబు రాజ్యసభకు పంపాలనుకున్నారని… కానీ ఆ తర్వాత అదనపు అడ్వకేట్ జనరల్ చేశారని వివరించారు. ఎన్‌వీ రమణ అదనపు అడ్వకేట్ జనరల్‌గా వాదించిన కేసులు కూడా పెద్దగా లేవని వెల్లడించారు. చంద్రబాబుకు, హైకోర్టు న్యాయమూర్తులకు మధ్య ఎన్‌వీ రమణ లైజనింగ్ చేసేవారని… న్యాయమూర్తుల అవసరాలను ఎన్‌వీ రమణ చూసుకునే వారని బీఎస్‌ఏ స్వామి తన పుస్తకంలో వివరించారు.

పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పదవులు ఇస్తామంటూ న్యాయమూర్తులకు ఆశ చూపే వారని… అందువల్లే చంద్రబాబు ప్రయోజనాలకు విరుద్దంగా ఎలాంటి ఉత్తర్వులు హైకోర్టులో వచ్చేవి కాదని బయటపెట్టారు. రమణ ఆమోదం లేకుండా న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ ఫైలును కూడా చంద్రబాబు క్లియర్‌ చేసేవారు కాదని వెల్లడించారు. దాంతో రమణ ఇంటి ముందు ఆశావాహులంతా క్యూ కట్టేవారని… వారిలో కొందరు సీనియర్ న్యాయమూర్తులు కూడా ఉండేవారని చెప్పారు.

ఎస్‌బీ సిన్హా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంత కాలం పరోక్షంగా ప్రధాన న్యాయమూర్తి పాత్ర ఎన్వీ రమణదేనని బీఎస్‌ఏ స్వామి తేల్చిచెప్పారు. ఎన్‌వీ రమణ టీడీపీ ప్రయోజనాలను కాపాడే రక్షకుడిగా నిలిచారని వివరించారు.

ఒక్క ప్రభా శంకర్ మిశ్రా సీజేగా ఉన్న సమయంలో మాత్రమే వీరి ఆటలు సాగలేదని పుస్తకంలో వివరించారు. మిగిలిన ప్రధాన న్యాయమూర్తులంతా వీరి వలలో చిక్కుకుని చెప్పినట్టు చేశారన్నారు. న్యాయవాది ఎన్‌ శోభను హైకోర్టు న్యాయమూర్తిని చేయాల్సి ఉండగా… ఆమె తనకు తోకగా ఉండరన్న దురుద్దేశంతో శోభ స్థానంలో రోహిణిని న్యాయమూర్తిని చేశారని వెల్లడించారు. ఎన్‌వీ రమణ న్యాయవ్యవస్థ ప్రయోజనాల కోసం పనిచేసి ఉంటే చాలా మంచి జరిగేదని… కానీ న్యాయవ్యవస్థ తలరాత అలా లేదని దళితుడైన, హైకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎస్‌ఏ స్వామి తన పుస్తకంలో ఆవేదన చెందారు.

First Published:  19 Oct 2020 9:18 PM GMT
Next Story