Telugu Global
International

వ్యాక్సిన్ కోసం జాబితా రెడీ అవుతోంది...

కరోనా వ్యాక్సిన్ ఇంకా మార్కెట్లోకి రాకముందే దానికోసం కేంద్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేస్తోంది. మొత్తం పేర్లను అన్ని రాష్ట్రాల నుంచి తీసుకుని డేటా బేస్‌ తయారు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వ్యాక్సిన్‌ వస్తే ముందుగా ఎంత మందికి వేయాల్సి ఉంటుందన్న దానిపై కేంద్రం ఓ అంచనాకు వస్తోంది. దేశంలో 20 కోట్ల నుంచి 25 కోట్ల మందికి తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశ జనాభాలో దాదాపు […]

వ్యాక్సిన్ కోసం జాబితా రెడీ అవుతోంది...
X

కరోనా వ్యాక్సిన్ ఇంకా మార్కెట్లోకి రాకముందే దానికోసం కేంద్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేస్తోంది. మొత్తం పేర్లను అన్ని రాష్ట్రాల నుంచి తీసుకుని డేటా బేస్‌ తయారు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వ్యాక్సిన్‌ వస్తే ముందుగా ఎంత మందికి వేయాల్సి ఉంటుందన్న దానిపై కేంద్రం ఓ అంచనాకు వస్తోంది.

దేశంలో 20 కోట్ల నుంచి 25 కోట్ల మందికి తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశ జనాభాలో దాదాపు 18 శాతం మందికి తొలి దశలో టీకా ఇచ్చే అవకాశముంది. ప్రాధాన్యం ప్రకారం ముందుగా వైద్య సిబ్బందికి టీకా ఇస్తారు. దీనికోసం ఇప్పటికే రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపింది. కేంద్రం సూచనలతో రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లతో పాటు మొత్తం సిబ్బంది పేర్లతో ఆ జాబితా తయారు చేయాలని జిల్లా వైద్యాధికారుల(డీఎంహెచ్‌వో)ను రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్లు ఆదేశించారు. ఈ నెల 31 నాటికి రాష్ట్రాలు జాబితా తయారు చేసి కేంద్రానికి అందిస్తే.. అధికారిక పోర్టల్‌ లో కేంద్రం ఆ జాబితాను ఉంచుతుంది.

కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నవారికి మాత్రమే తొలి దఫా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. అందులోనూ వైద్య సిబ్బందికి తొలి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. దీనికి తగ్గట్టుగానే జాబితా తయారు చేస్తున్నాయి రాష్ట్రాలు. ఈ మేరకు ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కూడా తొలి దశలో వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు.

కేంద్రం నిర్ణయించిన ఫార్మాట్‌ ప్రకారం వైద్య సిబ్బంది పేర్లు, పనిచేసే ఆస్పత్రి పేరు లేదా పని చేసే ప్రాంతం, మండలం, జిల్లా వంటి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం జాబితా తయారు చేస్తోంది. వారిలో ఎవరికైనా ఇప్పటివరకు కరోనా సోకిందా? ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా? తదితర వివరాలను కూడా పంపిస్తారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలే ప్రజలకు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి తగు శిక్షణ ఇవ్వడంపై కూడా కసరత్తులు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్న కేంద్రం.. దానికి తగ్గ కసరత్తులు పూర్తి చేస్తోంది.

First Published:  20 Oct 2020 10:42 PM GMT
Next Story