Telugu Global
National

అమరావతి అసైన్డ్ భూముల స్కాంలో కొత్తమలుపు

తుళ్లూరు మాజీ తహసీల్దార్‌ అన్నే సుధీర్‌బాబుపై సీఐడీ దర్యాప్తుకు లైన్‌ క్లియర్ అయింది. తనపై సీఐడీ విచారణ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సుధీర్‌బాబుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్ కొట్టివేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిన అంశాన్ని గుర్తు చేశారు. సుధీర్‌బాబుపై ఉన్న అభియోగాలు చాలా తీవ్రమైనవిగా కోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ అంశంలో దర్యాప్తు జరగాల్సిందేనని అభిప్రాయపడింది. పేదల అసైన్డ్‌ భూములను మార్చడంలో […]

అమరావతి అసైన్డ్ భూముల స్కాంలో కొత్తమలుపు
X

తుళ్లూరు మాజీ తహసీల్దార్‌ అన్నే సుధీర్‌బాబుపై సీఐడీ దర్యాప్తుకు లైన్‌ క్లియర్ అయింది. తనపై సీఐడీ విచారణ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సుధీర్‌బాబుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్ కొట్టివేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిన అంశాన్ని గుర్తు చేశారు.

సుధీర్‌బాబుపై ఉన్న అభియోగాలు చాలా తీవ్రమైనవిగా కోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ అంశంలో దర్యాప్తు జరగాల్సిందేనని అభిప్రాయపడింది. పేదల అసైన్డ్‌ భూములను మార్చడంలో తహసీల్దార్‌గా పనిచేసిన సుధీర్‌బాబు కీలక పాత్ర పోషించారన్న వాదనతో కోర్టు ఏకీభవించింది.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాజధాని ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు, పేదల అసైన్డ్ భూములను కొట్టేసే వ్యవహారంలో నాటి తహసీల్దార్‌గా అన్నే సుధీర్‌బాబు కీలక పాత్ర పోషించారన్నది అభియోగం.

అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదని, ఉచితంగా లాగేసుకుంటుందని అన్నే సుధీర్‌బాబు ప్రచారం చేశారు. దాంతో భయపడిపోయిన పేదలు వారి అసైన్డ్ భూములను తక్కువ ధరకే టీడీపీ నేతలకు అమ్మేలా సుధీర్‌బాబు పేదలను తప్పుదోవ పట్టించారన్న అభియోగంపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లి సుధీర్‌బాబు స్టే తెచ్చుకున్నారు.

స్టే ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తును అడ్డుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా స్టేలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించింది. ఈనేపథ్యంలో బెంచ్‌లు మారి కేసు జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ వద్దకు వచ్చింది.

First Published:  21 Oct 2020 9:57 PM GMT
Next Story