Telugu Global
National

రెండు అధికారిక నివాసాలపై మండిపాటు

ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మూడో రోజూ విచారణ జరిగింది. ఎన్నికల కమిషన్‌లో పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదని నిమ్మగడ్డ ఆరోపించారు. తన నివాసం వద్ద పనిచేసేందుకు అడిషినల్ అటెండర్ల పోస్టులు భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని నిమ్మగడ్డ నివాసాన్ని అధికారిక నివాసంగా గుర్తించాలని నిమ్మగడ్డ వాదించారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ […]

రెండు అధికారిక నివాసాలపై మండిపాటు
X

ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మూడో రోజూ విచారణ జరిగింది.

ఎన్నికల కమిషన్‌లో పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదని నిమ్మగడ్డ ఆరోపించారు. తన నివాసం వద్ద పనిచేసేందుకు అడిషినల్ అటెండర్ల పోస్టులు భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని నిమ్మగడ్డ నివాసాన్ని అధికారిక నివాసంగా గుర్తించాలని నిమ్మగడ్డ వాదించారు.

దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న మీకు హైదరాబాద్‌లో అధికారిక నివాసం ఎందుకని ప్రశ్నించింది. విజయవాడలో ఒక అధికారిక నివాసం, హైదరాబాద్‌ లో ఒక అధికారిక నివాసం ఏర్పాటు చేసుకోవడం ప్రజాధనాన్ని వృథా చేయడం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు లేకుండా కోర్టు ముందుకు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

First Published:  22 Oct 2020 8:21 AM GMT
Next Story