ఏపీని ఆదర్శంగా తీసుకోవాలి – కేంద్రమంత్రి రమేష్‌ పోక్రియల్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను కేంద్ర విద్యా మంత్రి రమేష్ పోక్రియల్ ప్రశంసించారు. విజయవాడ ఎన్‌సీఈఆర్‌టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన వెబినార్ ద్వారా ప్రశంసించారు.

గ్రామ సచివాలయాలు, విద్యా సంస్కరణలను కేంద్రమంత్రి అభినందించారు. కరోనా సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.

విద్యాకానుక, నాడు-నేడు, అమ్మ ఒడి పథకాలను వివరించారు. వెబినార్‌లో ఏపీ సీఎం జగన్‌ చేపట్టిన సంస్కరణలను కేంద్రమంత్రి ప్రశంసించారు.

గ్రామ సచివాలయ వ్యవస్థతో మంచి పాలన అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో విద్యార్థులకు మంచి న్యూట్రిషియన్ ఫుడ్ అందిస్తున్నారని… ఏపీ ప్రభుత్వాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు.