Telugu Global
National

పేదల ఉద్యమంపై చంద్రబాబుకి ఎందుకీ అక్కసు " ఎంపీ సురేష్

మూడు రాజధానుల ప్రకటన అనంతరం మొదలైన అమరావతి ఉద్యమం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. అమరావతి మాత్రమే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలంటూ కొంతమంది చేస్తున్న ఉద్యమానికి వ్యతిరేకంగా.. అదే అమరావతి ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉద్యమం మొదలు పెట్టారు. మూడు రాజధానులకే తమ మద్దతు అంటూ నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారంటూ ప్రతిపక్షాలపై వీరు మండిపడుతున్నారు. దీంతో ఈ రెండు ఉద్యమాల మధ్య పోటీ […]

పేదల ఉద్యమంపై చంద్రబాబుకి ఎందుకీ అక్కసు  ఎంపీ సురేష్
X

మూడు రాజధానుల ప్రకటన అనంతరం మొదలైన అమరావతి ఉద్యమం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. అమరావతి మాత్రమే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలంటూ కొంతమంది చేస్తున్న ఉద్యమానికి వ్యతిరేకంగా.. అదే అమరావతి ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉద్యమం మొదలు పెట్టారు. మూడు రాజధానులకే తమ మద్దతు అంటూ నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారంటూ ప్రతిపక్షాలపై వీరు మండిపడుతున్నారు. దీంతో ఈ రెండు ఉద్యమాల మధ్య పోటీ మొదలైంది.

అయితే మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలో ఇటీవల మొదలైన ఈ ఉద్యమాన్ని చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ ల ఉద్యమంగా అభివర్ణిస్తున్నారంటూ మండిపడ్డారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్. బాబు అనుకూల మీడియా కూడా పేదల ఉద్యమంపై విషం చిమ్ముతోందంటూ దుయ్యబట్టారు. అమరావతిలో దీక్షలు చేస్తున్నవారి దగ్గరకు వెళ్లి చూస్తే, ఎవరు మేకప్ వేసుకున్నారు, ఎవరు బంగారు నగలు దిగేసుకున్నారు, వజ్రాల ఉంగరాలు ఎవరు పెట్టుకున్నారో తేలిగ్గా అర్థమవుతుందని ఆయన మీడియాకి సూచించారు. ఆకలి కేకలు ఎవరివో.. అరక్క అరిసే కేకలు ఎవరివో తేలిపోతుందని చెప్పారు.

పేద‌వారిని ఆర్టిస్టుల‌‌ని చంద్ర‌బాబు మాట్లాడటం సరికాదని అన్నారాయన. ఉద్యమంలో ఆర్టిస్ట్ ల‌ను, సినిమా యాక్ట‌ర్ ల‌ను పెట్టింది ఎవ‌రో అంద‌రికీ తెలుసని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో సినీ నిర్మాతలకు, నటులకు చంద్రబాబు ఎంత చదవించుకున్నారో లెక్కలున్నాయని అన్నారు.

అమరావతిలో నిరుపేదలకు ప్లాట్లు ఇవ్వాలని ఉద్యమం చేస్తే.. టీడీపీ నాయకులు నీఛమైన కామెంట్స్ చేశారని మండిపడ్డారు. పేద‌లు, ఎస్సీలు, ఎస్టీలు, బీ‌సీలు, మైనార్టీలు త‌లుచుకుంటే ఏం జ‌రుగుతుందో చంద్ర‌బాబు ప్ర‌త్య‌క్షంగా చూశారని, ఇంకా ప్రత్యేకంగా తాను చెప్పాల్సిన అవసరం లేదన్నారు. డ‌బ్బా పేప‌ర్లు అన్నీ క‌ల‌సి కూర్చొని చంద్ర‌బాబుని హైప్ చేసినా గత ఎన్నికల్లో ఫలితం లేకుండా పోయిందని అన్నారు.

పేదవారి తరపున పోరాటం చేస్తానన్న లోకేష్.. అమరావతిలో ఇళ్ల స్థలాల కోసం దీక్షలు చేస్తున్న పేదల వద్దకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు ఎంపీ సురేష్. కృష్ణాయ‌పాలెంలో టీడీపీ గుండాలు పేద‌వారిని అడ్డుకుని, కొట్టి, ట్రాక్ట‌ర్ తో పేద‌ల‌ను, ద‌ళితుల‌ను తొక్కించే ప్ర‌య‌త్నం చేశారని, ఇంత‌కంటే నీఛ సంస్కృతి ఇంకోటి లేదన్నారు.

అమరావతిలో చంద్రబాబు సామాజిక వర్గం మినహా ఇంకెవరూ ఉండకూడదా అని ప్రశ్నించారు. అమరావతి అంటే చంద్రబాబు సొత్తు కాదని గుర్తు చేశారు. ఇంక పేదవారికి కీడు చేయాలని చూస్తే టీడీపీ రానున్న రోజుల్లో బతికి బట్టకట్టలేదని అన్నారు. మీడియా సమావేశంలో చివరిగా తమ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కూడా సెటైర్ వేశారు ఎంపీ సురేష్. పగలు విగ్గు పెట్టుకుని, రాత్రి పెగ్గు పట్టుకునే ఆయన గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ తప్ప ఇంకేమీ కాదని అన్నారు ఎంపీ సురేష్.

First Published:  23 Oct 2020 9:46 AM GMT
Next Story