Telugu Global
National

మన సివిల్ సర్వెంట్లలో ఆరవైశాతం మంది ఇంజనీర్లే !

ఇంజనీరింగ్ డిగ్రీని సాధారణ డిగ్రీ స్థాయిలో పరిగణిస్తున్న రోజులివి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరవుతున్న, ర్యాంకులు సాధిస్తున్న అభ్యర్థుల విద్యార్హతలను పరిశీలించినా మనకు ఇదే అర్ధమవుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి సివిల్ సర్వెంట్స్ గా వస్తున్నవారిలో గత రెండేళ్లుగా అరవైశాతం మంది ఇంజనీర్లే ఉంటున్నారు. సివిల్ సర్వీస్ పరీక్షలు రాసేవారు భిన్నమైన విద్యార్హతలు కలవారై ఉండాలని భావిస్తూ, యుపిఎస్ సి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సివిల్స్ లో ఇంజనీర్ల సంఖ్య […]

మన సివిల్ సర్వెంట్లలో ఆరవైశాతం మంది ఇంజనీర్లే !
X

ఇంజనీరింగ్ డిగ్రీని సాధారణ డిగ్రీ స్థాయిలో పరిగణిస్తున్న రోజులివి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరవుతున్న, ర్యాంకులు సాధిస్తున్న అభ్యర్థుల విద్యార్హతలను పరిశీలించినా మనకు ఇదే అర్ధమవుతుంది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి సివిల్ సర్వెంట్స్ గా వస్తున్నవారిలో గత రెండేళ్లుగా అరవైశాతం మంది ఇంజనీర్లే ఉంటున్నారు. సివిల్ సర్వీస్ పరీక్షలు రాసేవారు భిన్నమైన విద్యార్హతలు కలవారై ఉండాలని భావిస్తూ, యుపిఎస్ సి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సివిల్స్ లో ఇంజనీర్ల సంఖ్య మాత్రం తగ్గటం లేదు.

ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కి శిక్షణకు వెళ్లిన 2020 బ్యాచ్ సివిల్ సర్వెంట్లు 428 మందిలో 245 మంది అంటే 57.25శాతం మంది ఇంజనర్లే ఉన్నారు. ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు మేనేజ్ మెంట్ చదువులు చదివినవారు 8 మంది. ఈ బ్యాచ్ లో 84 మంది మాత్రమే ఆర్ట్స్ చదువుల నేపథ్యం ఉన్నవారు.

2019లో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కి శిక్షణకు వెళ్లిన 325 మంది సివిల్ సర్వీస్ ట్రైనీల్లో 191 మంది అంటే 58.7శాతం మంది ఇంజనీర్లు ఉన్నారు. 10 మంది ఇంజనీరింగ్ తోపాటు మేనేజ్ మెంట్ కోర్సులు చదివినవారు కాగా ఆర్ట్స్ చదువుల నుండి వచ్చినవారు 52 మంది. అంతకుముందు ఏడాది కూడా మొత్తం సంఖ్య 367 మందిలో 57.4శాతం మంది ఇంజినీర్లు ఉన్నారు. కాస్త సంఖ్య అటు ఇటు అవుతుంది తప్ప సివిల్ సర్వీస్ ల్లోకి వచ్చేవారిలో ఇంజనీర్ల సంఖ్య ఎక్కువగానే ఉంటున్నదని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టర్ సంజీవ్ చోప్రా అన్నారు.

First Published:  24 Oct 2020 1:53 AM GMT
Next Story