Telugu Global
National

గీతం వర్శిటీ కబ్జా కోరలు పీకిన ఏపీ ప్రభుత్వం

విశాఖలోని గీతం యూనివర్శిటీ భూకబ్జాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గీతం యూనివర్శిటీ పక్కనే రుషికొండ, ఎండాడ ప్రాంతంలో 40. 51 ఎకరాల ప్రభుత్వ భూమిని యూనివర్శిటీ తన ఆధీనంలో ఉంచుకుంది. ఈ భూమి విలువ వందల కోట్లలో ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్శిటీ కలిపేసుకుంది. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల ఏర్పాటు చేసిన సిట్‌కు కూడా ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు విచారణ జరిపారు. 40. […]

గీతం వర్శిటీ కబ్జా కోరలు పీకిన ఏపీ ప్రభుత్వం
X

విశాఖలోని గీతం యూనివర్శిటీ భూకబ్జాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గీతం యూనివర్శిటీ పక్కనే రుషికొండ, ఎండాడ ప్రాంతంలో 40. 51 ఎకరాల ప్రభుత్వ భూమిని యూనివర్శిటీ తన ఆధీనంలో ఉంచుకుంది. ఈ భూమి విలువ వందల కోట్లలో ఉంటుంది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్శిటీ కలిపేసుకుంది. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల ఏర్పాటు చేసిన సిట్‌కు కూడా ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు విచారణ జరిపారు.

40. 51 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం యూనివర్శిటీ చెరలో ఉన్నట్టు తేల్చారు. ఈ మేరకు ఆర్డీవో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. భూమిని కబ్జా నుంచి విడిపించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో విశాఖ ఆర్డీవో పెంచల్ కిషోర్ ఆధ్వర్యంలో యంత్రాంగం రంగంలోకి దిగింది. ప్రభుత్వ భూమిలో గీతం యూనివర్శిటీ ఏర్పాటు చేసిన కంచెను అధికారులు తొలగించారు. అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.

ఈ గీతం యూనివర్శిటీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు చెందినది. ఆయనే ఈ వర్శిటీకి ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నారు.

First Published:  23 Oct 2020 9:50 PM GMT
Next Story